పోరాటంలో లుకలుకలు : ఉద్యమం నుంచి బయటకొస్తున్నాం – రెండు రైతు సంఘాలు

పోరాటంలో లుకలుకలు : ఉద్యమం నుంచి బయటకొస్తున్నాం – రెండు రైతు సంఘాలు

farmer unions : కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న పోరాటంలో లుకలుకలు స్టార్ట్ అయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలతో రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళనల నుంచి రెండు రైతు సంఘాలు తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ యూనియన్ లోని భానువర్గం తప్పుకున్న వారిలో ఉన్నాయి. వీఎం సింగ్ ను రైతు పోరాటం సమన్వయ సమితి నుంచి తొలగించినట్లు రైతు నాయకులు చెబుతున్నారు. ఘాజీ పూర్ లో వీఎం సింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ ఆందోళన చేపడుతోంది.

నిన్నటి ఘటనల వల్ల రైతుల ఆందోళనల నుంచి తప్పుకుంటున్నామని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన నేత వీఎం సింగ్ ప్రకటించారు. రైతుల పోరాటం మరో మార్గంలో వెళ్లడాన్ని ఆమోదించమని, కొందరు నేతలు ర్యాలీని ముందుగానే ప్రారంభించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. నిర్దేశిత మార్గాల్లో కాకుండా..ర్యాలీని వేరే మార్గంలో ఎందుకు తీసుకెళ్లారు ? నిర్దేశిత మార్గాల్లో కాకుండా..ర్యాలీని వేరే మార్గాల్లో ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది ? ఎర్రకోటపై జెండా ఎగరేసి ఏం సాధించాం ? అంటూ ప్రశ్నలు సంధించారు. ఎర్రకోటపై ఎగిరే త్రివర్ణ పతాకం మన పూర్వికుల త్యాగఫలమని వెల్లడించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆందోళన నుంచి తప్పుకుంటున్నామని మరోసారి స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500 వందల సంఘాలు 63 రోజులుగా ఉద్యమం కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున..మంగళవారం జరిగిన ఆందోళనల్లో రైతు ప్రాణం కోల్పోవడం, పోలీసులు గాయాలవడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. మీవల్లే తప్పు జరిగిందంటూ..సంఘాలకు చెందిన నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. హింస చెలరేగడంపై కొన్ని రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వేరే మార్గంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. తమకు సంబంధం లేదంటూ..అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి సంఘానికి చెందిన నేతలు వెల్లడిస్తున్నారు.
ఫిబ్రవరి 01వ తేదీన బడ్జెట్ సందర్భంగా..పార్లమెంట్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై రైతు సంఘాలు చర్చించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చూడాలి.