Indore : పింక్ బస్ డ్రైవర్లుగా ఇద్దరు మహిళలు..

ఇండోర్ లో పింక్ బస్ డ్రైవర్లుగా ఇద్దరు మహిళలు నియమితులయ్యారు. వీరిలో మధ్యప్రదేశ్ లోనే తొలి మహిళా డ్రైవర్ గా పేరొందిన రీతూ నర్వాల్, మరో మహిళ అర్చనా కఠేరా నియమితులయ్యారు.

Indore : పింక్ బస్ డ్రైవర్లుగా ఇద్దరు మహిళలు..

Indore Pinke Bus Driver

2 Female Drivers Operated Pink City Buses : ఇండోర్ లో తొలిసారిగా ఓ మహిళా డ్రైవర్ విధుల్లో చేరారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింక్ సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించగా.. మొట్ట మొదటి మహిళా డ్రైవర్ నియమితులయ్యారు. దేశంలో కోటి జనాభా దాటిని నగరాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా ‘పింక్ బస్సు’లను నడుపుతామని కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగానే బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణించాలని ప్రోత్సహిస్తూ అటల్‌ ఇండోర్‌ సిటీ ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌ లిమిటెడ్‌( ఏఐసీటీఎల్‌) కొత్తగా ‘పింక్‌ బస్‌’ సేవలను ప్రారంభించింది.

మధ్యప్రదేశ్ వాణిజ్య రాజధాని ఇండోర్ లో 2020 ఫిబ్రవరి 4న పింక్ బస్సులను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బస్సులో ఇప్పటి వరకు డ్రైవర్లుగా మగవారే ఉండేవారు. కండక్లర్ గా మాత్రం మహిళలు ఉండేవారు. కానీ ఇప్పుడా బస్సుల రథసారధులగా మహిళలు నియమితులయ్యారు. కాగా ఈ బస్సులను నడపాలంటే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈక్రమంలో రీతు నర్వాల్, అర్చన కఠారేలకు అటువంటి లైసెన్స్ ఉండటంతోవారిని సెలెక్ట్ చేశారు.వీరిద్దరికి ఐబస్ నడపటానికి రెండు నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. అలా ఇద్దరు పూర్తి స్థాయిలో బస్సులను నడిపేలా తయారయ్యారు.ముఖ్యంగా రద్దీ రోడ్లపై ఈ బస్సులను నడపాలంటే చాలా నేర్పు ఉండాలి. ఆ నేర్పు వీరిద్దరికి ఉండటంతో పింక్ ఐబస్ స్టీరింగ్ లను వీరికి అప్పగించారు.

కొన్ని నెలల క్రితం ఇద్దరు మహిళా డ్రైవర్లను షార్ట్ లిస్ట్ చేయగా..ఇద్దరు సెలక్ట్ అయ్యారు. రీతు నర్వాల్, అర్చన కఠారే అనే మహిళలకు ట్రైనింగ్ ఇచ్చారు. వారిలో రీతూ నర్వాలే అనే మహిళ డ్రైవర్ గా నియమితులయ్యారు. అలా వారు ఇద్దరు ‘పింక్ బస్ స్టీరింగ్’ పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏఐసీటీఎల్‌ ఇన్‌ఛార్జ్‌ సందీప్‌ సోని మాట్లాడుతూ.. పింక్‌ బస్సులు కేవలం మహిళల కోసం కేటాయించామని, ఇప్పటికే మహిళా కండక్టర్లు ఉన్నారని మరి కొంతమంది మహిళా కండక్టర్ల, డ్రైవర్లను నియమిస్తామని చెప్పారు. అయితే బీఆర్‌టీఎస్‌ కారిడార్‌లో రోడ్డు చాలా క్లిష్టంగా ఉంటుందని..అందుకే మహిళా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.

 

చిన్ననాటి కల నిజం చేసుకున్న రీతు నర్వాల్..
‘నేను ఎప్పటికైనా హెవీ మోటర్‌ వెహికల్‌ డ్రైవర్‌ కావాలకున్నా. బస్‌ లేదా ట్రక్‌ ఏదైనా నడపాలని కల కన్నాను. ఇప్పుడు నా కల నిజమైంది. నేను 28ఏళ్ల వయస్సులో.. 2015లో ఓ స్కూల్‌ బస్‌ నడపడంతో డ్రైవింగ్‌ మొదలుపెట్టాను’ అని నర్వాల్‌ తెలిపారు. బస్సులోని ప్రతీ అక్కా, చెల్లెలి రక్షణ తన బాధ్యత అని తెలిపారు.

సొంత వాహనంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నా
గతంలో మూడేళ్లు ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు డ్రైవర్‌గా పనిచేశాను. ‘నా సొంత వాహనంతో డ్రైవింగ్‌ నేర్చుకున్నా. మూడే నెలల డ్రైవింగ్‌ ట్రైనింగ్ తరువాత ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు డ్రైవర్‌గా మూడేళ్లపాటు పనిచేశాను. తర్వాత మరో హోటల్‌కి మారాను. కోవిడ్‌-19 ‍కారణంగా కుటుంబం కోసం ఆ ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నేను పింక్‌ డ్రైవర్‌గా నియమించబడ్డాను’ ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. తోటి ఆడవారిని సురక్షితంగా గమ్యం చేర్చటానికి అనుక్షణం జాగ్రత్తగా డ్యూటీ చేస్తానని తెలిపారు అర్చన.