బెయిల్ కావాలంటే శానిటైజర్లు, మాస్కులు విరాళం ఇవ్వాలి

బెయిల్ కావాలంటే శానిటైజర్లు, మాస్కులు విరాళం ఇవ్వాలి

మధ్యప్రదేశ్ హై కోర్టు లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఆల్కహాల్ అక్రమంగా సప్లై చేస్తున్నందుకు పట్టుబడ్డ వారికి కొత్త రకమైన శిక్ష విధించింది. ఐదు లీటర్ల శానిటైజర్‌తో పాటు స్థానిక జిల్లా ఆసుపత్రులు ఒక్కొక్క దానికి 200మాస్కులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. జస్టిస్ వివేక్ రుసియా అధ్యక్షతన ఏర్పాటైన బెంచ్ జూన్ 30న ఆర్డర్ ఆదేశాలిచ్చి సరోజ్ రాజ్‌పుత్, రవి హరోద్ లు ఒక్కొక్కరు రూ.40వేలు బెయిల్ ఇవ్వాలని సూచించింది.

వారు పారామెడిక్స్ సాయంతో ఐదు లీటర్ల శానిటైజర్లు, 200 మాస్కులు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి ధార్ జిల్లా ఆసుపత్రి ఒక్కొక్కదానికి ఇలా విరాళాలు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. దీని అనుగుణంగానే ఇద్దరినీ గురువారం జైలు నుంచి విడుదల చేశారని లాయర్ ఓం ప్రకాశ్ సోలంకి అన్నారు.

మే21న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎమ్ఎఫ్ఎల్)ను ఇండోర్ నుంచి నగ్డా తీసుకెళ్తుండగా వారిని పట్టుకున్నారు. .