Same-Sex Marriages: ఇద్దరు జడ్జీలు నిర్ణయించలేరు.. స్వలింగ సంపర్కుల వివాహంపై బీజేపీ ఎంపీలు

స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదించాలని ఆయన కోరారు. "ఇద్దరు న్యాయమూర్తులు ఇంత ముఖ్యమైన సామాజిక అంశంపై నిర్ణయం తీసుకోలేరు. పార్లమెంటుతో పాటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి" అని అన్నారు. భారత శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కుల వివాహాల్ని అడ్డుకునే సెక్షన్ 377ను 2018లో సుప్రీం కోర్టు రద్దు చేసింది

Same-Sex Marriages: ఇద్దరు జడ్జీలు నిర్ణయించలేరు.. స్వలింగ సంపర్కుల వివాహంపై బీజేపీ ఎంపీలు

2 Judges Can't Decide says BJP MP's Strong Objection On Same-Sex Marriages

Same-Sex Marriages: స్వలింగ సంపర్క వివాహాల్ని ఇద్దరు జడ్జీలు నిర్ణయించలేరంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్లమెంట్ వేదికగా వ్యాఖ్యానించారు. స్వలింగ సంపర్క వివాహాలపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుప్రీంకు కేంద్రం సమాధానం ఇచ్చేముందు బీజేపీ ఎంపీలు పై విధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. పార్లమెంట్ జీరో అవర్‭లో బిహార్‭కు చెందిన ఎంపీ సుశీల్ మోదీ స్పందిస్తూ ఈ దేశ సంప్రదాయాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకూడదని అన్నారు.

Kapil Sibal: కొలీజియంను సమర్ధించిన కపిల్ సిబాల్.. కోర్టులు కాషాయమయం కావొద్దంటూ హెచ్చరిక

‘‘స్వలింగ్ సంపర్కుల వివాహాల్ని చట్టబద్ధం చేయడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. భారతదేశంలోని ముస్లిం పర్సనల్ లా లేదంటే ఏదైనా క్రోడీకరించబడిన చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల వివాహాలు ఆమోదించబడవు. స్వలింగ సంపర్కుల వివాహాలు ఆ చట్టాల ప్రకారం కొన్ని సున్నితమైన అంశాలపై విధ్వంసాన్ని చూపిస్తాయి. కానీ కొందరు వామపక్ష ఉదారవాదులు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ దేశ సాంస్కృతిక ధర్మాలకు విరుద్ధంగా న్యాయవ్యవస్థ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు’’ అని సుశీల్ మోదీ అన్నారు.

Elon Musk: ట్విట్టర్ బాస్‭ ఎలాన్ మస్క్‭కు షాక్.. మస్క్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబిచ్చిన నెటిజెన్లు

స్వలింగ సంపర్కుల వివాహాలకు వ్యతిరేకంగా కోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టిగా వాదించాలని ఆయన కోరారు. “ఇద్దరు న్యాయమూర్తులు ఇంత ముఖ్యమైన సామాజిక అంశంపై నిర్ణయం తీసుకోలేరు. పార్లమెంటుతో పాటు సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరగాలి” అని అన్నారు. భారత శిక్షాస్మృతిలో స్వలింగ సంపర్కుల వివాహాల్ని అడ్డుకునే సెక్షన్ 377ను 2018లో సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఈ చారిత్రాత్మక తీర్పు అనంతరం నాటి నుంచి స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ అనేక డిమాండ్లు వస్తున్నాయి. ప్రాథమిక హక్కుల్లో ఇది భాగమని అంటున్నారు. ఈ విషయమై చాలా రోజుల కిందే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Bhupesh Baghel: బజరంగీ గూండాలు కాషాయ దుస్తుల్లో తిరుగుతూ.. పఠాన్ సినిమా కాంట్రవర్సీపై ఛత్తీస్‭గఢ్ సీఎం

స్వలింగ వివాహాలను అనుమతించే విధంగా చట్టాలను సవరించాలంటూ నలుగురు స్వలింగ సంపర్కులు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. స్వలింగ సంపర్కుల వివాహాలను కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యతిరేకించింది. చట్టాన్ని రూపొందించే ప్రక్రియ నుంచి న్యాయస్థానాలు దూరంగా ఉండాలని, ఆ విషయాన్ని పార్లమెంటుకు వదిలివేయాలని కేంద్రం పేర్కొంది. అయితే దీనిపై జనవరి 6 లోపు సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది.