Bihar: తెల్లారేసరికి మాయమైన రెండు కిలోమీటర్ల రోడ్డు.. గ్రామస్తుల ఆశ్చర్యం.. అసలేం జరిగింది?

బిహార్‌లోని ఒక గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల రోడ్డు తెల్లారేసరికి మాయమైంది. రోజూ నడిచే రోడ్డు తెల్లారి లేచేసరికి కనిపించకుండా పోవడంతో గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు.

Bihar: రెండు కిలోమీటర్ల రోడ్డు ఒక్క రోజులో కనిపించకుండా పోవడం ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! కానీ, బిహార్‌లోని ఒక గ్రామ పరిధిలో మాత్రం రోడ్డు మాయమైంది. సాయంత్రం అదే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిన గ్రామస్తులకు తెల్లారి లేచేసరికి ఆ రోడ్డు కనిపించలేదు.

Tirumala Tirupati Devasthanams: ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం.. కీలక నిర్ణయాలు

ఈ ఘటన బిహార్, బంకా జిల్లా, రాజౌ పరిధిలోని ఖరౌని గ్రామంలో జరిగింది. అసలు విషయం ఏంటంటే.. ఖరౌని, కదంపూర్ గ్రామాలను కలుపుతూ, రెండూళ్ల మధ్య రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఈ రెండు గ్రామాల ప్రజలు ఈ రోడ్డును ఎప్పట్నుంచో వాడుతున్నారు. అయితే, ఇటీవల ఒకరోజు ఉదయం లేచి చూసేసరికి ఆ రోడ్డు కనిపించలేదు. రోడ్డు స్థానంలో పొలం కనిపించింది. ఈ పొలంలో గోధుమ పంట వేసి ఉంది. ఇది చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. ముందురోజు రాత్రి వినియోగించిన రోడ్డు తెల్లారేసరికి ఏమైపోయిందని కదంపూర్ గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ రోడ్డును ఖరౌని గ్రామానికి చెందిన కొందరు గూండాలు ధ్వంసం చేసి, పొలంగా మార్చారని తెలుసుకున్నారు.

Delhi liquor scam: ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లు

దీనిపై కదంపూర్ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ గూండాలు ప్రజలను బెదిరిస్తూ కర్రలు, రాడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, ఆక్రమించుకున్న స్థలంలో తిరిగి రోడ్డు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

 

 

ట్రెండింగ్ వార్తలు