CoviSelf Kit: కొవీసెల్ఫ్ హోమ్ టెస్ట్ కిట్.. 15 నిమిషాల్లో రిజల్ట్

'కొవీసెల్ఫ్' ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (RAT) కిట్ రెడీ అయింది. రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషాల్లోనే ఫలితాలు ...

CoviSelf Kit: కొవీసెల్ఫ్ హోమ్ టెస్ట్ కిట్.. 15 నిమిషాల్లో రిజల్ట్

Coviself Kit

CoviSelf Kit: ‘కొవీసెల్ఫ్’ ఇండియాలోనే ఫస్ట్ సెల్ఫ్ యూజ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ (RAT) కిట్ రెడీ అయింది. రెండు నిమిషాల్లోనే టెస్టు పూర్తి అవడంతో పాటు 15 నిమిషల్లోనే ఫలితాలు వస్తాయి. పూణెకు చెందిన కంపెనీ ఈ కిట్ రెడీ చేసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దీనికి ఆమెదం కూడా తెలియజేసింది.

‘టెస్టు చేయడానికి రెండు నిమిషాల సమయం పట్టడంతో పాటు ఫలితం కోసం 15నిమిషాలు వెయిట్ చేస్తే సరిపోతుంది. రాబోయే వారం చివరి నాటికి అందుబాటులో ఉంటుందని.. ఇండియా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షల ఆన్ లైన్ ఫార్మసీల్లో దొరుకుతుంది. మా లక్ష్యం ఇండియాలో 90శాతం ప్రాంతాలకు ఇది చేరుకోవాలని’ అని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ డైరక్టర్ సుజీత్ జైన్ చెప్పారు.

ఈ టెస్టు అనే సెల్ప్ యూజ్ కోసం మాత్రమే. మీకు టెస్టులో పాజిటివ్ వస్తే.. ఆర్టీ-పీసీఆర్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మా మాన్యువల్ చదివి ఎవరైనా దీనిని ఉపయోగించుకోవచ్చు.

లక్షణాలు ఉన్న వారు, కరోనా వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారు ఈ కిట్ ఉపయోగించవచ్చని ఐసీఎమ్మార్ చెప్తుంది. వివక్షాపూరితమైన టెస్టుల కోసం దీనిని వాడరాదని సూచించారు.