పెళ్లి కావడం లేదని..2 వేల 331 మంది ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : September 7, 2020 / 07:30 AM IST
పెళ్లి కావడం లేదని..2 వేల 331 మంది ఆత్మహత్య

భారతదేశంలో ఆత్మహత్యలు రికార్డు క్రియేట్ చేశాయి. గత 11 ఏళ్లలో అత్యధిక ఆత్మహత్యలు 2019లో జరిగాయని జాతీయ నేర గణాంకాల మండలి (NCRB) నివేదికలు వెల్లడించాయి. పేదలు, తక్కువ చదువుకున్న వారే అధికంగా ఉన్నారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాల వారు 10 శాతంగా ఉన్నారు. పెళ్లీడొచ్చినా..వివాహం కావడం లేదని 2 వేల 331 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని నివేదికలో పొందుపరిచింది.

గత సంవత్సరం తెలంగాణలో 7 వేల 675 మంది, ఏపీలో 6 వేల 465 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలో 389 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.




ప్రతి లక్ష మంది జనాభాకు ఆత్మహత్య చేసుకుంటున్న వారి జాతీయ సగటు 10.4 కాగా, తొలి 3 స్థానాల్లో ఛత్తీస్ గడ్ (26.4), కేరళ (24.3), తెలంగాణ (20.6) ఉన్నాయి.
https://10tv.in/maharashtra-first-place-in-suicides-nc-rb-report-revealed/
2011లో లక్షా 35 వేల 585 ఆత్మహత్యలు జరగగా, క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 2017లో అత్యల్పంగా లక్షా 29 వేల 887, రెండేళ్లలో లక్షా 39 వేల ఆత్మహత్యలతో రికార్డు నమోదైంది.




ఇక ఆదాయ పరంగా చూస్తే…ఏడాదికి రూ. లక్ష లోపు ఆదాయం ఉన్న నిరుపేదలు 66.2 శాతంగా ఉంది అంటే..92 వేల 083 మంది. లక్ష నుంచి రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు మరో 29.6 శాతం అంటే 41 వేల 197 మంది. మొత్తం ఆత్మహత్యల బాధితుల్లో రూ. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలే 95.8 శాతంగా ఉన్నారు.

70 శాతం మంది తక్కువ చదువుకున్నవారేనని నివేదిక పేర్కొంది. ఇందులో చదువుకోని వారు 12.6 శాతం కాగా..చదువుకున్న వారు 16.3 శాతంగా ఉండడం గమనార్హం.




అనారోగ్యం కారణంగా 17 మంది అంటే..ఒక శాతం మంది ఈ సమస్యతో ప్రాణాలు తీసుకున్నారు. 28.5 శాతంతో ఏపీ రెండో ప్లేస్ లో ఉంది.
మానసిక ఆందోళనలతో ఏకంగా 11 వేల 009 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కుటుంబ సమస్యలతో 32.4 శాతం మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం 42.8 శాతం మందితో 6వ స్థానంలో ఉంది.
పరీక్షలు తప్పామన్న కారణంతో 2 వేల 744 మంది సూసైడ్ చేసుకున్నారు.
అప్పుల సమస్యలతో 5 వేల 908 మంది ప్రాణాలు తీసుకున్నారు. తెలంగాణలో 989 మంది, ఏపీలో 828 మంది ఉన్నారు.

దేశంలో ఆత్యహత్యల లెక్కలు : 2009 (1,27,151). 2010 (1,34,599). 2011 (1,35,585). 2012 (1,35,445). 2013 (1,34,799). 2014 (1,31,666). 2015 (1,33,623). 2016 (1,29,887). 2018 (1,34,516). 2019 (1,39,123).