West Bengal : మెరుపులు,పిడుగుల బీభత్సం..20 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో ఉరుములు..మెరుపులు బీభత్సం సృష్టించాయి.వీటితో పాటు పడిన పిడుగుల ధాటికి 20మంది ప్రాణాలు కోల్పోయారు.

West Bengal : మెరుపులు,పిడుగుల బీభత్సం..20 మంది మృతి

West Bengal Lightning Strikes

West Bengal lightning strikes : పశ్చిమ బెంగాల్‌లో మెరుపులు, ఉరుములు బీభత్సం సృష్టించాయి. మెరుపులు, ఉరుములు,పిడుగుల ధాటినిక 20మంది దుర్మరణ పాలయ్యారు. సోమవారం (జూన్ 7.2021)న ఉరుములు, మెరుపులతో కూడినా భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మెరుపులతో పాటు పెద్ద పాటున పిడుగులు కూడా పడటంతో 20మంది మృతి చెందారు. ఉరుములు, మెరుపులు, పిడుగులతోపాటు తీవ్రమైన గాలులతో కూడిన వర్షం ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. కళ్లు చెదిరిపోయే మెరుపులు…కర్ణకఠోరంగా పిడుగులు పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఇళ్లల్లో ఉండాలో..బైటకు పరుగులు తీయాలో కూడా తెలియని అయోమయంలో పడిపోయి భయాందోళనలకు గురయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకస్మాత్తుగా కురిసిన ఉరుములు మెరుపులతో కురిసిన వానలకు 20 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ముర్షీదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున, తూర్పు మేదినీపూర్ జిల్లాలో ఇద్దరు పిడుగులు పడి చనిపోయినట్టు వెల్లడించారు.

ఈ ప్రకృతి విపత్తుకు 20 మంది ప్రాణాలు కోల్పోపోయిన విషయం తెలిసిన ప్రధాని నరేంద్రమోడీ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. అనంతరం ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్ర ద్వారా వెల్లడించారు.