Maharashtra Political Crisis: షిండేకు షాక్.. ఉద్ధవ్‌తో టచ్‌లో 20మంది రెబల్స్?

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలతో  తమతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది.

Maharashtra Political Crisis: షిండేకు షాక్.. ఉద్ధవ్‌తో టచ్‌లో 20మంది రెబల్స్?

Uddhav Thackeray

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఆసక్తికర మలుపు తిరుగుతోంది. తనకు 39మంది శివసేన ఎమ్మెల్యేలు, పలువురు స్వతంత్రుల మద్దతు ఉందని ఏక్‌నాథ్ షిండే ప్రకటించగా.. ఉద్ధవ్ ఠాక్రే క్యాంపు మాత్రం 20మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలు  తమతో టచ్‌లో ఉన్నట్లు తెలిపింది. షిండే, తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సంజయ్ రౌత్, మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించిన తర్వాత అసలు విషయం తెలుస్తుందని చెప్పారు. శివసేన ఇప్పటికీ బలమైన పార్టీ అని రౌత్ అన్నారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని, వారు ముంబయికి వచ్చాక మీకే తెలుస్తుందని, ఎలాంటి పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారనేది త్వరలోనే వెల్లడిస్తానని రౌత్ చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఒత్తిడి కారణంగానే రెబల్స్ పార్టీని వీడారని రౌత్ పేర్కొన్నారు. శివసేనను వీడిన వారు బాల్ ఠాక్రేకి నిజమైన అనుచరులు కాదని ఆయన అన్నారు.

Maharashtra Governor : రంగంలోకి మహారాష్ట్ర గవర్నర్‌..రెబల్‌ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశం

బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్ షిండే నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన వర్గంలోని పలువురు శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలు అందుకు ససేమీరా అంటున్నట్లు సమాచారం. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంటే తాము ఉద్ధవ్ వెంటే ఉంటామని వాళ్లు ఇప్పటికే షిండేకు తెలిపినట్లు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చసాగుతుంది. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే మిత్రుడు శరద్ పవార్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ ఇతర మంత్రులతో సమావేశమయ్యారు. గౌహతిలో 46మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నారని, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు చేరతారని ఏక్‌నాథ్ షిండే ప్రకటించిన నేపథ్యంలో, 20మంది ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం సమయంలో ఉద్ధవ్ వెంట వెలితే షిండేకు ఎదురు దెబ్బతగలడం ఖాయం.

South Africa: అనుమానాస్పద స్థితిలో 20మంది మృతి.. వారి శరీరాలపై మాత్రం..

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో నెగ్గాలంటే షిండేకు కనీసం 37మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. లేకుంటే వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చి ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించబడవచ్చు. వారిపై అనర్హత వేటు పడిన పక్షంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తే వారు సభలో బీజేపీకి ఓటు వేయలేరు. శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్డీయేకు 113 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు 32మంది మెజారిటీ మార్క్‌ను కలిగి ఉన్నారు. అయితే 37మంది శివసేన రెబల్స్ ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి రాకపోతే ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చి, వారు అనర్హులైతే ఈ స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి మరికొన్ని నెలలు సమయం లభిస్తుంది. తిరుగుబాటుదారులు తనను కలుసుకుని కోరితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్ష పదవులను వదులుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు.