లాక్‌డౌన్ సమయంలో కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయిన యువతికి 3నెలల పాటు టార్చర్

లాక్‌డౌన్ సమయంలో కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయిన యువతికి 3నెలల పాటు టార్చర్

మేఘాలయాకు చెందిన యువతి లాక్‌డౌన్ సమయంలో మూడు నెలల పాటు కొలీగ్ ఇంట్లో చిక్కుకుపోయింది. ఈ సమయంలో ఆమెను టార్చర్ పెట్టి వేధింపులకు గురి చేశారు. జనవరిలో ఆ యువతికి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం రావడంతో షిల్లాంగ్ నుంచి ఢిల్లీకి వెళ్లింది.

ప్రభుత్వం కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రకటించడంతో కొలీగ్ ఇంటికి రమ్మని పిలిచాడు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉండటంతో బయటకు రాలేకపోయింది. అంతేకాదు ఢిల్లీలో తెలిసిన వాళ్లింటికి గానీ, పేరెంట్స్ తో గానీ కాంటాక్ట్ చేయడానికి అనుమతించలేదు. ఇంటికి వెళ్లాలని.. తన తల్లిని కలవాలని ప్రాధేయపడింది బాధితురాలు.

గత శుక్రవారం ఎట్టకేలకు ఇంట్లోంచి బయటపడగలిగింది. పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేయడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల ప్రకారం.. కేసులు బుక్ చేశారు. యువతి ఫిర్యాదు అనంతరం.. నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టెన్సెస్ చట్ట ప్రకారం.. ఢిల్లీ గేట్ పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.

నిందితుడ్ని జైలుకు పంపాం. మెజిస్ట్రేట్ ముందు విచారణ జరిగిందని ఢిల్లీ గేట్ పోలీస్.. స్టేషన్ ఆఫీసర్ రాజేంద్ర త్యాగి చెప్పారు. ‘ఢిల్లీలోని తన బంధువుల ఇంటికి బాధితురాలిని పంపించాం. అక్కడి నుంచి షిల్లాంగ్ కు పంపిస్తాం’ అని అధికారి వెల్లడించారు.