బెంగళూరులో కరోనా సోకిన తల్లులకు డెలివరీ..200 చిన్నారులకు నెగటివ్

  • Published By: madhu ,Published On : August 12, 2020 / 07:09 AM IST
బెంగళూరులో కరోనా సోకిన తల్లులకు డెలివరీ..200 చిన్నారులకు నెగటివ్

బెంగళూరు నగరంలో కరోనా కేసులు అధికంగానే నమోదవుతున్నా…కరోనా వైరస్ సోకిన తల్లులకు బెంగళూరు వైద్యులు డెలివరీ చేశారు. 200 మంది చిన్నారులు ప్రస్తుతం ఆరోగ్యవంతంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు. విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రుల్లో వైద్యులు విశేష కృషి చేశారు.

దీని ఫలితంగా చిన్నారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా…నెగటివ్ వచ్చినట్లు సంతోషంగా చెప్పారు వైద్యులు. ఇక్కడకు వచ్చిన తల్లులకు కరోనా వైరస్ ఉందని గుర్తించామని, డెలివరీ సమయం ఒక ఛాలెంజ్ గా భావించామని డా. సీఆర్ జయంతి (the Director and Dean) చెప్పారు.

తల్లులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని..సిబ్బందితో పలు జాగ్రత్తలు తీసుకుని డెలివరీ చేయడం జరిగిందన్నారు. పీపీఈ కిట్లు ధరించి..డెలివరీ చేసిన వైద్యులను అభినందించారు. “no mean feat”గా అభివర్ణించారు. చిన్నారులకు మంచి భవిష్యత్ ఉండాలని తాను ఆకాక్షించిస్తున్నట్లు తెలిపారు.

వైద్య సిబ్బందిని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి డా.కే.సుధాకర్ అభినందించారు. గొప్ప సేవగా అభివర్ణించారు. తాను OB/GYN doctors గుర్తించానని, కోవిడ్ వైరస్ ను అరికట్టేందుకు నిబద్ధతతో, మానవత్వంతో పని చేయాలని సూచించడం జరిగిందన్నారు.

కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు కోవిడ్ రోగులను తిప్పి పంపించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు విశేష పనికనబర్చాయన్నారు. కరోనా నెగటివ్ వచ్చిన గర్భిణీలను సైతం వారు తిరస్కరించారని, కానీ విక్టోరియా, వాణి విలాస్ ఆసుపత్రులను వారిని చేర్చుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ప్రసవించిన 200 మంది చిన్నారుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు.

కర్నాటక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 1.82 లక్షల కేసులు నమోదయ్యాయ. వీటిలో 3 వేల 300 మరణాలు సంభవించాయి. 80 వేల యాక్టివ్ కేసులుగా ఉన్నాయి.