మూడు రోజుల్లో 200 కుక్కలు మృతి..ఏం జరిగింది ?

మూడు రోజుల్లో 200 కుక్కలు మృతి..ఏం జరిగింది ?

200 dogs found dead : భారతదేశంలో వైరస్ లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తుండగా..జంతువులు చనిపోతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. గిలగిలా కొట్టుకుంటూ మృతి చెందుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా..కోళ్లు, పక్షులు చనిపోవడం చూశాం.

కానీ..వెస్ట్ బెంగాల్ లో కుక్కలు మృతి చెందుతున్నాయి. బెంగాల్ లోని బంకురా జిల్లా బిష్ణుపూర్ పట్టణంలో మూడు రోజుల వ్యవధిలో 200లకు పైగా..శునకాలు చనిపోయాయి. మంగళవారం 60, బుధవారం 97, గురువారం 45 కుక్కలు చనిపోయాయని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే..ఇవి ఎందుకు చనిపోయాయనే సంగతి తెలియడం లేదు. శునకాల నుంచి నమూనాలను సేకరించారు వెటర్నరీ సిబ్బంది పరీక్షల నిమిత్తం కోల్ కతాకు పంపించారు. కుక్కల మృతికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమని వైద్య సిబ్బంది అనుమానిస్తున్నారు.

పర్వో వైరస్ (Parvovirus) కారణంగా..మూగజీవాలు అకస్మాత్తుగా మరణించి ఉండవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ సమస్య విష్ణుపూర్ కు మాత్రమే పరిమితమై ఉందంటున్నారు. జిల్లా అధికారులకు విషయం తెలియచేయడం జరిగిందని Bishnupur’s civic body chief Divyendu Bandyopadhyay తెలిపారు. మనుషులు, జంతువులకు సోకే ప్రమాదం చాలా తక్కువని Veterinarians అధికారులు వెల్లడిస్తున్నారు. మృతదేహాలను బిష్నుపూర్ మున్సిపాల్టీ డంపింగ్ గ్రౌండ్ వద్ద ఖననం చేశామన్నారు.200 dogs found dead in 3 days in Bengal town