Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్

గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్‌లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అధికారులు వెల్లడించారు.

Food Poisoning: పెళ్లి విందులో 200మందికి ఫుడ్ పాయిజన్

Food Poisioning

 

 

Food Poisoning: గుజరాత్ లోని కటార్గమ్ గ్రామంలో జరిగిన పెళ్లి డిన్నర్‌లో 200కంటే ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే 200మందికి అతిథులకు జ్వరం, వాంతులు అయ్యాయని, 9మందికి హెల్త్ తీవ్రంగా ఉండటంతో సమీప హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యారని అధికారులు వెల్లడించారు.

నిత్యానంద్ ధామ్ ప్రాంతంలో పెళ్లి కార్యక్రమం జరిగింది. అందులో మెనూగా ద్రాక్ష, బెంగాలీ స్వీట్స్ అయిన ఓరియో సాకె, అంగూర్ రబ్రీ, కేసర్ కుమ్‌కుమ్ ఏర్పాటు చేశారు. అవి తిన్న వారిలో ఒకరు నడకకు కష్టంగా ఉండటంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు.

హెల్త్ డిపార్ట్‌మెంట్ టాప్ అఫీషియల్స్.. ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించారు. మునిసిపాలిటీకి చెందిని ఫుడ్ డిపార్ట్‌మెంట్ స్వీట్స్ శాంపుల్స్ సేకరించి టెస్టింగ్ కు పంపించారు. ఆరోగ్య అధికారులు ఘటనాస్థలికి చేరుకున్న వెంటనే ప్రాథమిక చికిత్స పూర్తి చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు.

Read Also: పెళ్లిలో ఫుడ్ పాయిజన్ : 500 మందికి అస్వస్ధత

సకాలంలో బాధితులను హాస్పిటల్ కు చేర్పించడంతో వారంతా క్షేమంగా ఉన్నారని మునిసిపాలిటీ అధికారులు పేర్కొన్నారు.