Vellore CMC Covid Cases : వెల్లూరు సీఎంసీలో 200 మంది డాక్టర్లు,సిబ్బందికి కరోనా

తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి - సీఎంసీ- లో దాదాపు 200 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో డాక్టర్లు, నర్సులతో సహా పలువురు సిబ్బంది ఉన్నారు. దీంతో ఆస

Vellore CMC Covid Cases : వెల్లూరు సీఎంసీలో 200 మంది డాక్టర్లు,సిబ్బందికి కరోనా

Cmc Vellore

Vellore CMC Covid Cases :  తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి – సీఎంసీ- లో దాదాపు 200 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. వీరిలో డాక్టర్లు, నర్సులతో సహా పలువురు సిబ్బంది ఉన్నారు. దీంతో ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలను నిలిపివేశారు.

గత వారంలో సీఎంసీ ఆస్పత్రి  సమీపంలోని బాబురావు వీధిలో  కోవిడ్ కేసులు పెరిగిన నేపధ్యంలో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది. ఆస్పత్రిలో చికిత్స కొసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివల్ల కోవిడ్ కేసులు పెరిగినట్లు గుర్తించారు.  ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ నివారణ చర్యలు చేపట్టింది.
Also Read : Tamilnadu Encounter : ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మృతి
సీఎంసీ లో 2,000మంది వైద్యులతో సహా 10,500 మంది పని చేస్తున్నారు. దేశంలోని పలు  రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా రోగులు ఈ ఆస్పత్రిలో చికిత్స కొసం వస్తూ ఉంటారు.  వారివల్ల కూడా కొత్తవేరియంట్ ఈ ప్రాంతంలో విస్తరించినట్లు వెల్లూరు కార్పోరేషన్ అధికారులు తెలిపారు.  ఆస్పత్రిలోని  సిబ్బందిలో  కేసుల సంఖ్య పెరిగితే వారిని ఐసోలేషన్ లో ఉంచటంకానీ…. ఇంటికి కానీ పంపిస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.