బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో IM టెర్రరిస్ట్ అరిజ్ ఖాన్ కు ఉరిశిక్ష

2008నాటి బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఆరిజ్ ఖాన్‌కు ఉరి శిక్ష విధించింది.

బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో IM టెర్రరిస్ట్ అరిజ్ ఖాన్ కు ఉరిశిక్ష

Batla House Encounter 2008

Batla House Encounter 2008నాటి బట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రసంస్థకు చెందిన ఆరిజ్ ఖాన్‌కు ఉరి శిక్ష విధించింది. ఈ కేసుని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు న్యాయమూర్తి. అందుకే దోషికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో అరిజ్ ఖాన్ కు మొత్తం రూ.11లక్షల ఫైన్ కూడా విధించారు అడిషనల్ సెషన్స్ జడ్జి సందీప్ యాదవ్. బట్లా ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ ఆఫీసర్ మోహన్ చంద్ శర్మ కుటుంబసభ్యులకు తక్షణమే రూ.10లక్షలు విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

బట్లా ఎన్ కౌంటర్ కేసు ఏంటీ

2008 సెప్టెంబర్-19న… ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు చెందిన ఐదుగరు టెర్రరిస్టులు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో దక్షిణ ఢిల్లీలోని జామియా నగర్ లోని బాట్లా హౌస్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు ఎన్ కౌంటర్ మొదలు పెట్టారు. అయితే, ఆ ఎన్ కౌంటర్‌లో ఇన్ స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ టెర్రరిస్టుల కాల్పుల్లో అమరుడయ్యారు. అరిజ్ ఖాన్ స్పాట్‌లో ఉన్నాడని, అతడే మోహన్ చంద్ శర్మ మీద కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. ఎన్ కౌంటర్ తర్వాత అతడు పారిపోయినట్టు వెల్లడించారు. సుమారు పదేళ్ల తర్వాత 2018,ఫిబ్రవరి-14న నిందితుడు అరిజ్ ఖాన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. సంచలనం సృష్టించిన బాట్లా ఎన్ కౌంటర్ కేసులో అరిజ్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ మార్చి 8,2021న ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది.

కాగా, 2008లో ఎన్ కౌంటర్ సమయంలో బట్లా హౌస్ లోని అపార్ట్ మెంట్‌లో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో మొహమ్మద్ సాజద్, అతిఫ్ అమన్ ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. జునైద్, షాజాద్ అహ్మద్ అప్పుడు పారిపోయారు. కానీ, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పోలీసులు వారిని పట్టుకున్నారు. 2013 జూలైలో షాజాద్ అహ్మద్‌కు ఇదే కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ తీర్పుకి వ్యతిరేకంగా అహ్మద్ చేసుకున్న విజ్ణప్తి ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉంది.