కల్తీ మద్యం కేసు, 9 మందికి ఉరి శిక్ష

కల్తీ మద్యం కేసు, 9 మందికి ఉరి శిక్ష

gopalganj

Nine get death sentence : కల్తీ మద్యం కేసులో సంచలన తీర్పు వెలువడింది. బీహార్ కల్తీసారా కేసులో 9 మందికి మరణ శిక్ష విధిస్తూ..స్పెషల్ ఎక్సైజ్ కోర్టు ధర్మాసనం తీర్పును ప్రకటించింది. ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం..దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పాటు..ఈ కేసులో మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ కారాగారా శిక్షను ఖరారు చేసింది. జీవితకాలం శిక్ష పడిన మహిళలకు రూ. 10లక్షలు జరిమాన విధిస్తూ..న్యాయస్థానం తీర్పును వెలువరించింది.

అసలేం ఏం జరిగింది ?

2016లో బీహార్‌లో సీఎం నితీశ్‌కుమార్‌ మద్యపానాన్ని నిషేధించారు. ఆగస్టు నెలలో గోపాల్ గంజ్ లో కల్తీ మద్యం తాగి 21 మంది చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు కంటి చూపు కోల్పోయారు. ఇక అప్పటి నుంచి కోర్టులో వాదనలు కొనసాగాయి. 14 మంది జిల్లా జడ్జి ఎదుట తమ నేరాన్ని ఒప్పుకొన్నారు. వీరిలో ఒకరు కేసు ట్రయల్‌లో ఉండగానే చనిపోయారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తేదీన ఇచ్చిన తీర్పులో 13 మందిని దోషులుగా తేల్చింది స్పెషల్ ఎక్సైజ్ కోర్టు.