దేశ్ కీ నేతలు : 1,500 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం కేసులు 

543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8,049 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1500 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 08:49 AM IST
దేశ్ కీ నేతలు : 1,500 మంది అభ్యర్థులపై హత్య, అత్యాచారం కేసులు 

543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8,049 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1500 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు సామాన్యులు ఏమీ కాదు. మేధావులతోపాటు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు కొంత మంది అభ్యర్థులు. చరిత్రతో సంబంధం లేకుండా ఆయా పార్టీలు టికెట్లు కేటాయించి.. ప్రతినిధుల సభకు పంపుతున్నాయి పార్టీలు. లోక్‌సభ ఎన్నికల్లో నేర చరితుల వివరాలను వెల్లడించింది Association of Democratic Reforms (ADR) సంస్థ వెల్లడించింది.

543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8,049 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 1,500 మందిపై క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్‌లను అధ్యయనం చేసిన ఆ సంస్థ.. నేర చరిత్ర ఉన్నవారి జాబితాను సోమవారం (మే 14,2019)న విడుదల చేసింది.

క్రిమినల్ కేసులున్న 1,500 మందిలో 1,076 మందిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులున్నాయి. పార్టీల వారీగా బీజేపీలో ఎక్కువ మంది నేర చరిత్ర కలిగిన అభ్యర్థులు ఉన్నారని తెలిపింది. బీజేపీ తరపున 433 మంది పోటీ చేస్తుండగా.. వారిలో 175 మందిపై క్రిమినల్ కేసులు ఉండటం విశేషం. వీరిలో 154 మంది తీవ్రమైన కేసులను ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. 

2019లో బీజేపీ నుంచి 433 మంది అభ్యర్థులుండగా.. వీరిలో 175మందిపై క్రిమినల్ కేసులుండగా 124మంది మాత్రమే తమపై ఇటువంటి కేసులున్నాయని ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన 419మంది అభ్యర్థుల్లో 164 మంది, బీఎస్పీ నుంచి 381 మందిలో 85 మంది, సీపీఐ(ఎం) నుంచి 69 మంది అభ్యర్థుల్లో 40 మంది, ఇండిపెండెంట్ అభ్యర్థులు 400 మందిలో 400 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్స్ లో స్పష్టం చేశారు.

2019 ఎన్నికల్లో 1,048 మంది  కోటీశ్వరులు ఎన్నికల బరిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో  2,217 మంది అభ్యర్థులు కోటీశ్వరులుగా ఉన్నారు. 2009లో ఎన్నికల్లో 7,810 మంది అభ్యర్థులు తమ ఆస్తులను ప్రకటించగా.. వీరిలో 1,249 మంది అభ్యర్థులు కోటీశ్వరులు ఉన్నట్లుగా తెలిపారు.