Punjab Election : పంజాబ్‌‌లో రైతు సంఘాల కీలక నిర్ణయం, ఎన్నికల్లో పోటీ

22 రైతుల సంఘాలు మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తమ మోర్చాకు ప్రజలు మద్దతివ్వాలని....

Punjab Election : పంజాబ్‌‌లో రైతు సంఘాల కీలక నిర్ణయం, ఎన్నికల్లో పోటీ

Punjab poll

22 Farm Bodies : పంజాబ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని రైతు సంఘాలు ఒకతాటిపైకి వచ్చాయి. 22 రైతుల సంఘాలు ఓ నిర్ణయం తీసుకున్నాయి. కొత్త రాజకీయ వేదికను స్థాపించాయి. ‘సంయుక్త సమాజ్ మోర్చా’ను స్థాపించి..ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించాయి. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..ఏడాది పాటు ఆందోళనల్లో ఈ రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో..రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాజేవాలే, రైతు నాయకులు హర్మీత్ సింగ్ ఖాదియన్ ఇతర నేతలు మీడియాకు తెలిపారు. రైతుల ఆందోళనలో తాము విజయం సాధించడం జరిగిందని, ఇప్పుడు రాజకీయ రంగంలో పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. పొత్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఆప్ ఆద్మీ పార్టీతో పొత్తుపై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.

Read More : Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి అలజడి: సీఎంగా దిగిపోనున్న బొమ్మై? నిజమెంతా?

ఢిల్లీ సరిహద్దులో జరిగిన రైతుల ఉద్యమంలో మొత్తం 32 రైతుల సంఘాలు పాల్గొన్నాయి. కానీ..22 రైతుల సంఘాలు మాత్రమే రాజకీయ వేదికను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. తమ మోర్చాకు ప్రజలు మద్దతివ్వాలని రైతు సంఘం నాయకుడు బల్బీర్ సింగ్ రాజెవాలే ప్రజలకు సూచించారు. వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఇక్కడ పాగా వేయాలని ఆప్ ఇప్పటికే పలు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పార్టీ విజయం సాధిస్తుందని సర్వేలు సైతం ప్రకటించాయి.

Read More : Omicron Rajasthan : ఒమిక్రాన్ టెర్రర్, రాజస్థాన్‌‌లో కొత్తగా ఎన్ని కేసులో తెలుసా

ఈ క్రమంలో 22 రైతు సంఘాలు రాజకీయ పార్టీని స్థాపించడం విశేషం. ఏ ఒక్క పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మెజార్టీ వచ్చే అవకాశం లేదని ఏబీపీ-సీవోటర్స్‌ సర్వే వెల్లడిస్తోంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకోగా, 20 స్థానాల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ కు 15 సీట్లు రాగా, బీజేపీ కేవలం 3 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. ఈసారి ఎలాగైనా పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. మరి రైతు సంఘాలు – ఆప్ మధ్య పొత్తు కుదురుతుందా ? లేదా ? అనేది చూడాలి.