2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ధర ఎంతంటే?

వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త 2022 వోల్వో XC40 మంగళవారం విడుదల చేసింది. తాజా అధికారిక వివరాల ప్రకారం.. 2022 వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో రూ. 55.90 లక్షలకు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించబడింది.

2022 Volvo XC40 Electric SUV: వోల్వో లగ్జరీ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ధర ఎంతంటే?

Xc 40

2022 Volvo XC40 Electric SUV: వోల్వో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త 2022 వోల్వో XC40 మంగళవారం విడుదల చేసింది. తాజా అధికారిక వివరాల ప్రకారం.. 2022 వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ SUV భారతదేశంలో రూ. 55.90 లక్షలకు ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభించబడింది. ఈ సరికొత్త మోడల్ దేశంలోనే మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం.

Ford Cars: భారత్ నుంచి నిష్క్రమిస్తున్న ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్‌.. కారణమేమంటే?

బెంగళూరు సమీపంలోని హాస్కోట్ లోని వోల్వో యూనిట్ లో, స్థానికంగా అసెంబ్లింగ్ చేసి ఇండియా తొలి లగ్జరి ఎలక్ట్రిక్ కారు అని కంపెనీ తెలిపింది. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు రూ. 50వేలు చెల్లించి వోల్వో వెబ్ సైట్ లోకి వెళ్లి జూలై 27 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. ఈ XC40 రీఛార్జ్ 11 kw వాల్ – బాక్స్ ఛార్జర్ తో వస్తుంది. 33 నిమిషాల్లో కారులో 10 నుంచి 80 శాతం వరకు, 50 kw ఫాస్ట్ ఛార్జర్ తో సుమారు 2.5 గంటల్లో 100శాతం ఛార్జ్ అవుతుందని వోల్వో తెలిపింది. 418km పరిధితో XC40 రీఛార్జ్ ఇండియాలో హై-స్పెక్ “ట్విన్” వెర్షన్‌లో అందుబాటులో ఉంది, ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఒక్కో యాక్సిల్‌పై ఒకటి 408hp , 660Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2022 XC40 ఎలక్ట్రిక్‌తో మీరు పొందేవి ..
– మూడు సంవత్సరాల సమగ్ర కారు వారంటీ
– మూడు సంవత్సరాల వోల్వో సర్వీస్ ప్యాకేజీ
– మూడు సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్
– ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీ
– డిజిటల్ సేవలకు నాలుగు సంవత్సరాల సబ్‌స్క్రిప్షన్
– థర్డ్ పార్టీ ఇంటీరియర్ ద్వారా 1 వాల్ బాక్స్ ఛార్జర్ (11 kW)