Panchayat Election: 21ఏళ్లకే సర్పంచ్ ఎన్నికలు గెలిచిన యువతి

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ కు చెందిన 21ఏళ్ల లక్షికా దగర్ అనే యువతి పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ సాధించింది. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో సాధించిన ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సున్న సర్పంచ్‌గా నిలిచింది.

Panchayat Election: 21ఏళ్లకే సర్పంచ్ ఎన్నికలు గెలిచిన యువతి

Sarpanch Election

 

 

Panchayat Election: మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్ కు చెందిన 21ఏళ్ల లక్షికా దగర్ అనే యువతి పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ సాధించింది. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో సాధించిన ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సున్న సర్పంచ్‌గా నిలిచింది. అది కూడా తన బర్త్ డేకు ఒక్క రోజు ముందే ఈ విషయంతో తెలియడంతో మరింత సంతోషం మరింత ఎక్కువైంది.

మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన దగర్.. ఉజ్జయిన్‌లో రేడియో జాకీగా విధులు నిర్వర్తిస్తున్నారు. నామినేషన్ పేపర్స్‌ను ఫిల్ చేసిన తర్వాత.. గ్రామానికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నానని అదే తన విజయం వెనుక మోటివేషన్ అని దగర్ అంటున్నారు.

డ్రింకింగ్ వాటర్, డ్రెయిన్, స్ట్రీట్ లైట్ లాంటి సమస్యలను పరిష్కారిస్తానని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. దీంతో పాటుగా ఇల్లులేని వారికి హౌజింగ్ స్కీంతో సొంతిల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ సర్పంచ్ పోటీలో లక్షికతో పాటుగా మరో ఏడుగురు అభ్యర్థులు పాల్గొన్నారు.

Read Also : సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష.. పెట్టింది ఎవరో తెలుసా ?