TV Sets : దటీజ్ ఇండియా.. 136కోట్ల జనాభా గల దేశంలో 30కోట్ల ఇల్లుంటే, 21కోట్ల టీవీలున్నాయి

ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. టీవీ మనలో ఓ భాగమైపోయింది. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా టెలివిజన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. మనకు ప్రధానమైన ఎంటర్ టైన్ మెంట్ అందేది టీవీ నుంచే కదా మరి. మరీ ముఖ్యంగా ఇంట్లోనే ఉండే గృహిణులకు, మహిళలకు టీవీ అంటే ఆరోప్రాణం అని చెప్పాలి. టెలివిజన్ లేదంటే వారు అస్సలు ఊరుకోరు. బోర్ కొట్టేస్తుందని గోల చేస్తారు.

TV Sets : దటీజ్ ఇండియా.. 136కోట్ల జనాభా గల దేశంలో 30కోట్ల ఇల్లుంటే, 21కోట్ల టీవీలున్నాయి

Tv Sets India

TV Sets In India : ఈ రోజుల్లో టీవీ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. టీవీ మనలో ఓ భాగమైపోయింది. ఇంట్లో ఏ వస్తువు ఉన్నా లేకున్నా టెలివిజన్ మాత్రం కచ్చితంగా ఉంటుంది. మనకు ప్రధానమైన ఎంటర్ టైన్ మెంట్ అందేది టీవీ నుంచే కదా మరి. మరీ ముఖ్యంగా ఇంట్లోనే ఉండే గృహిణులకు, మహిళలకు టీవీ అంటే ఆరోప్రాణం అని చెప్పాలి. టెలివిజన్ లేదంటే వారు అస్సలు ఊరుకోరు. బోర్ కొట్టేస్తుందని గోల చేస్తారు.

మరి కోట్లమంది జనాభా ఉన్న మన ఇండియాలో ఎన్ని ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి? ఎంతమంది టీవీ చూస్తున్నారు? ఇలాంటి లెక్కలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనికి సంబంధించి బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రేటింగ్‌ కౌన్సిల్‌(బార్క్‌) ఇంట్రస్టింగ్ లెక్కలు వెల్లడించింది.

బార్క్ ప్రకారం.. దేశంలో టీవీ వీక్షకుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతోంది. 2020 ఆఖరు నాటికి టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 6 శాతం పెరిగిందని బార్క్‌ గురువారం(ఏప్రిల్ 15,2021) వెల్లడించింది. దేశంలో 21 కోట్ల ఇళ్లల్లో టీవీలు ఉన్నాయంది. 2018 సంవత్సరాంతానికి 19.7 కోట్ల గృహాల్లో టీవీలు ఉండేవి. టీవీ సెట్ కలిగి ఉన్న మహిళల సంఖ్య 7 శాతం పెరిగింది, పురుషులు 6 శాతం పెరిగారు. 2018లో దేశంలో టీవీ చూసే వారి సంఖ్య 83.6 కోట్లు కాగా, 2020 నాటికి 89.2 కోట్లకు ఎగబాకింది. ఇండియా జనాభా దాదాపు 130 కోట్లు కాగా, దేశంలో 30 కోట్ల గృహాలు ఉన్నాయని బార్క్‌ చెప్పింది.

గత ఏడాది(2020) కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనం ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. టీవీ వీక్షణం పెరిగడానికి కారణం ఇదే అని బార్క్ విశ్లేషించింది. దేశంలో ఇంకా 9 కోట్ల గృహాల్లో టీవీలు లేవని వెల్లడించింది. దేశంలో జనాభా పెరుగుతుండడంతో ప్రసార, వినోద రంగంలో వృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయని బార్క్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సునీల్‌ లుల్లా చెప్పారు. నగర, పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే టీవీ వీక్షకులు పెరుగుతుండడం గమనార్హం.

ఇక టీవీ ఎక్కువగా చూసే వారిలో స్త్రీలు, పురుషుల కన్నా పిల్లలు ముందున్నారు. కిడ్స్ కేటగిరీలో (2 నుంచి 14ఏళ్ల వయసు) టీవీ వీక్షించే పిల్లల శాతం 9కి పెరిగింది. హిందీ మాట్లాడే మార్కెట్ లో 8శాతం పెరుగుదల ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో టీవీ వీక్షణ 5శాతం పెరిగింది. ఇక బీహార్, జార్ఖండ్, అసోం, ఒడిషా రాష్ట్రాల్లో టీవీ కలిగిన గృహాల సంఖ్య రెట్టింపు అయ్యింది.