రామ మందిరం కోసం: 2100 కిలోల గంట తయారు చేస్తున్న ముస్లిం సోదరుడు

  • Published By: veegamteam ,Published On : November 12, 2019 / 06:18 AM IST
రామ మందిరం కోసం: 2100 కిలోల గంట తయారు చేస్తున్న ముస్లిం సోదరుడు

అయోధ్య రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమం చేస్తూ..సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో  మందిర నిర్మాణం పనులు షురూ అయిపోయాయి. ఇలా తీర్పు వచ్చిందలో లేదో అలా పనులు ప్రారంభమైపోతున్నాయి. ఆలయ నిర్మాణానికి సంబంధించి అన్ని వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోంది. 

దేవాలయంలో గంట ప్రాముఖ్యత ఎంతగా ఉందో తెలియనిది కాదు.అందుకే ప్రతీష్టాత్మక రామ మందిరంలోకి ఘనమైన గంట కూడా తయారవుతోంది. యూపీలోని జలేసర్‌లో తయారయ్యే ఈ గంటకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ భారీ గంటకు సంబంధించిన ఆర్డర్ ఎప్పుడో రాగా..ఈ పనిని ముస్లిం సోదరుడు చేపట్టటం ప్రత్యేకత.  ఇక్బాల్  అనే ముస్లిం ఈ గంటను తయారు చేస్తున్నారు. రూ. 10 లక్షల వ్యయంతో ఈ గంటను రూపొందిస్తున్నారు. ఇటువంటివే మరో 10 గంటలను ఇక్కడ తయారు చేయనున్నారు.

ఈ పనులను పర్యవేక్షిస్తున్న వికాస్ మిట్టల్ మాట్లాడుతూ.. అయోధ్యలోని రామమందిరం కోసం రూపొందిస్తున్నఈ గంట 2100 కిలోల బరువు ఉంటుందన్నారు. వివిధ లోహాల మిశ్రమంగా ఈ గంటను తీర్చిదిద్దుతున్నారు. ఈ గంట ఎత్తు ఆరడుగులు ఉంటుందని తెలిపారు. కాగా అయోధ్య రామ మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ రావటంతో చేతి వృతుల వారితో పాటు గంటల తయారీదారులకు మంచి డిమాండ్ పెరిగింది. ఇప్పటికే పలు గంటల తయారీకి ఆర్డర్లు రావటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.