Ram Mandir “Ashtadhatu” Bell : అష్ణధాతువుతో తయారు చేసిన 2,100కిలోల రామ మందిరం గంట ప్రత్యేకతలు

అష్ణధావుతో తయారు చేసిన 2,100కిలోల రామ మందిరం గంట ప్రత్యేకతలు..

Ram Mandir “Ashtadhatu” Bell : అష్ణధాతువుతో తయారు చేసిన 2,100కిలోల రామ మందిరం గంట ప్రత్యేకతలు

Ram Mandir "Ashtadhatu" Bell

Ram Mandir “Ashtadhatu” Bell : సుప్రీంకోర్టులో తీర్పు వచ్చాక బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో నిర్మించే రామాలయం నిర్మాణం ఎన్నో అద్భుతాలతో రూపుదిద్దుకుంటోంది. ప్రఖ్యాతిగాంచిన శిల్పులతో ప్రతీ అంగుళంలోనూ ఏదోకొ ప్రత్యేకతను సంతరించుకుంటూ నిర్మితమవుతోంది రామ మందిర నిర్మాణం. అటువంటి రామమందిరంలో ఏర్పాటయ్యే గంట కూడా ఎన్నో ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ గంటకున్న ప్రత్యేకతలు అన్నీ ఇన్నీకావు. బరువు నుంచి తయారు చేసే విధానం వరకు అన్నీ ప్రత్యేకతలే. రామ మందిరంలో ఏర్పాటు చేసే గంట బరువు 2,100కిలోలు. 6 x 5 అడుగుల పొడవు, వెడల్పుతో రూపు దిద్దుకుంది. అష్ణధాతువులతో తయారు చేసిన ఈ గంట ఒక్కసారి మోగిస్తే 15 కిలోమీటర్ల దూరం వినిపిస్తుందట. ట్యుటికోరి నుంచి ఓ జేసీబీ సహాయంతో ఈ భారీ గంటను అయోధ్యకు తరలించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా రామమంది నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్న క్రమంలో 2024 జనవరి కల్లా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర హోమ్ శాఖామంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో భక్తులు రామయ్య దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.