Mumbai Rains: జలమయమైన ముంబై మహానగరం.. 22 మంది మృతి

ముంబై మహా నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ముంబై జలమమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్లు నిలవగా షణ్ముక్ నంద హాల్ రోడ్డు నీట మునిగింది.

Mumbai Rains: జలమయమైన ముంబై మహానగరం.. 22 మంది మృతి

22 Dead Several Injured In Mumbai Landslides After Heavy Rains

Mumbai Rains: ముంబై మహా నగరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ముంబై జలమమైంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునక గురయ్యాయి. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీళ్లు నిలవగా షణ్ముక్ నంద హాల్ రోడ్డు నీట మునిగింది. ఎవరార్డ్ నగర్, హనుమాన్ నగర్, పనవేల్, వాసీ, మాన్ ఖూర్, జీటీపీ నగర్, గాంధీ మార్కెట్ ఏరియాల్లో భారీ వర్షం పడింది.

సియాన్ రైల్వేస్టేషన్ లో వరద నీరు ట్రాక్ మీదకు చేరి ప్లాట్ ఫాం ఎత్తు వరకు వరదనీరు పారుతుంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో ఇళ్లల్లోకి నీళ్లు చేరగా.. అందేరీ, బోరివాలి ప్రాంతాల్లో జనం శనివారం రాత్రి నుండి నిద్రలేకుండా ఇళ్లల్లోని నీళ్లు ఎత్తిపోసుకున్నారు. వాటర్ లాగింగ్ ఏరియాల్లో భారీగా నీళ్లు నిలవడంతో హైవేలపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.

ఇక ముంబైలో వర్షాలు, వరదల వలన వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మరణించగా.. అధికారులు, ప్రభుత్వం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం తెల్లవారు జామున మహుల్ ప్రాంతంలో భరత్‌నగర్ లో కొండచరియలు విరిగిపడి కొండపై ఉన్న కొన్ని ఇళ్లపై కాంపౌండ్ గోడ కూలి 15 మంది మరణించగా ఇతర ప్రమాదాల్లో మరో ఏడుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.