Most Pollted Country India : కాలుష్య భారతం.. ప్రపంచంలోని 30 తీవ్ర కలుషిత నగరాల్లో 22 ఇండియాలోనే

ఇండియా.. పొల్యూషన్ కి కేరాఫ్ గా మారుతోందా? దేశంలో కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతోందా? ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు పొంచి ఉందా?

Most Pollted Country India : కాలుష్య భారతం.. ప్రపంచంలోని 30 తీవ్ర కలుషిత నగరాల్లో 22 ఇండియాలోనే

22 of worlds most polluted cities in india: ఇండియా.. పొల్యూషన్ కి కేరాఫ్ గా మారుతోందా? దేశంలో కాలుష్య నగరాల సంఖ్య పెరుగుతోందా? ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. వరల్డ్ ఎయిర్‌ క్వాలిటీ రిపోర్ట్‌ 2020 (ఐక్యూ ఎయిర్‌) పేరిట ఓ స్విస్‌ సంస్థ రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రమాద ఘంటికలు మోగించింది. మన దేశంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో కళ్ల ముందు వచ్చింది.

ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 30 కాలుష్య పీడిత నగరాల్లో(మోస్ట్ పొల్యూటడ్ సిటీస్) 22 మన భారత దేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య పీడిత రాజధాని నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఈ నివేదిక ప్రకారం.. ఢిల్లీ వాయు నాణ్యత 2019 కంటే 2020లో దాదాపు 15 శాతం మెరుగైంది. అయినా ఢిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజధాని నగరాల్లో అగ్రస్థానంలో ఉండటం ఆందోళనకరం. ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ కంట్రీస్ విషయానికి వస్తే ఇండియా థర్డ్ ప్లేస్ ఉంది.

ఢిల్లీకి అటూ ఇటూ ఉన్న రెండు ప్రధాన రాష్ట్రాల నుంచే 19 నగరాలు మోస్ట్ పొల్యూటడ్ సిటీస్ జాబితాలో ఉండటం గమనార్హం. వాయు కాలుష్యంలో ప్రధానమైన అతిసూక్ష్మస్థాయి ధూళికణాలు (పీఎం 2.5) డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం హైదరాబాద్‌లో రెండున్నర రెట్లు అధికం. బెంగళూరు, చెన్నై కంటే ఈ కాలుష్యం హైదరాబాద్‌లోనే ఎక్కువ.

* స్విస్‌ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య పీడిత నగరం చైనాలోని ఝింజియాంగ్‌. దీని తర్వాత వరుసగా తొమ్మిది స్థానాల్లో భారతీయ నగరాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గజియాబాద్‌ రెండో స్థానంలో ఉంది.
* 106 దేశాల నుంచి సేకరించిన పీఎం 2.5 వివరాల ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. కొవిడ్‌-19 తర్వాత లాక్‌డౌన్‌ వంటి పరిణామాల ప్రభావం కూడా ఈ నివేదికపై ఉంది.
* స్విస్‌ సంస్థ పరిశీలన మేరకు భారత్‌లో వాయు కాలుష్యానికి రవాణారంగం, వంట కోసం జీవవ్యర్థాల (వంటచెరకు, పేడ) దహనం, విద్యుదుత్పత్తి, పరిశ్రమలు, నిర్మాణరంగం, వ్యర్థాలను కాల్చడం, వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం ప్రధాన కారకాలుగా వెల్లడైంది. ఇందులో రవాణారంగం నుంచి వెలువడుతున్న కాలుష్యం ఎక్కువగా ఉంది.
* ఈ నివేదికపై ‘గ్రీన్‌పీస్‌ ఇండియా’కు చెందిన పర్యావరణ పరిశీలకులు అవినాశ్‌ చంచల్‌ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా ఢిల్లీతోపాటు మరికొన్ని నగరాల్లో కాలుష్యం తగ్గి, పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నారు. మళ్లీ జన సంచారం పెరిగినందున 2021లో వాయు కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన కాలుష్య నివారణకు కావాల్సిన చర్యలు తీసుకునేందుకు ఈ నివేదిక దోహదం చేస్తుందని స్విస్‌ సంస్థ ‘ఐక్యూ ఎయిర్‌’ సీఈవో ఫ్రాంక్‌ హ్యామస్‌ ఆశించారు.

వరల్డ్ మోస్ట్ పొల్యూటడ్ సిటీస్ జాబితా:
* ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ సిటీ ఝింజియాంగ్‌
* ప్రపంచంలో మోస్ట్ పొల్యూటడ్ సిటీస్ జాబితాలో రెండో స్థానంలో ఘజియాబాద్(యూపీ)
* Bulandshahr, Bisrakh Jalalpur (Uttar Pradesh)
* Bhiwadi (Rajasthan)
* Noida, Greater Noida, Kanpur, Lucknow (UP)
* Delhi, Faridabad (Haryana)
* Meerut (UP)
* Jind, Hisar (Haryana)
* Agra, Muzaffarnagar (UP)
* Fatehabad, Bandhwari, Gurugram, Yamuna Nagar, Rohtak (Haryana)
* Muzaffarpur (UP)
* Dharuhera (Haryana)
* Kashgar( China) (15వ ర్యాంకు)
* Manikganj in Bangladesh (16వ ర్యాంకు)
* Lahore(18వ ర్యాంకు), Bahawalpur(19వ ర్యాంకు) (Pakistan)
* Dhaka(23వ ర్యాంకు) (Bangladesh)
* South Tangerang (25వ ర్యాంకు) (Indonesia)