Agra : ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిపివేత…22 మంది రోగులు మృతి..

ఓపక్క కరోనాతో ప్రాణాలు పోతుంటే మరోపక్క యూపీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రిలో 5 నిమిషాల పాటు ఆక్సిజన్ నిలిపివేయటంతో 22మంది రోగులు నీలిరంగులోకి మారిపోయి ప్రాణాలు కోల్పోయారు.

Agra : ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిపివేత…22 మంది రోగులు మృతి..

Agra Paras Hospital

22 died in UP Paras Hospital Oxygen Mock Drill : ఓపక్క కరోనాతో ప్రాణాలు పోతుంటే మరోపక్క యూపీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం 22 మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ నిలిపివేయటంతో 22మంది రోగులు నీలిరంగులోకి మారిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రాలోని శ్రీ పరాస్ ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆక్సిజన్ మాక్ డ్రిల్ పేరుతో ఆసుప్రతి యాజమాన్యం రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగా సమాచారం.

ఏప్రిల్ 26న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు బయటపడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆక్సిజన్ సరఫరాను ఐదు నిమిషాల పాటు ఆపేశామని ఆసుపత్రి యజమాని డాక్టర్ అరింజయ్ జైన్ మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించిటంతో ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

పశ్చిమ యూపీలోని మోదీనగర్ లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. పేషెంట్లను తీసుకువెళ్లాలని..వారి కుటుంబ సభ్యులకు చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదని అరింజయ్ మాట్లాడినట్లుగా వీడియోలో రికార్డయింది..‘మాక్ డ్రిల్’ లాంటి ఓ ప్రయోగం చేయాలనుకున్నాం. దీంతో ఏప్రిల్ 26న ఉదయం 7 గంటలకు ఆరోగ్యం విషమించిన 22 మంది రోగులకు ఆక్సిజన్ ను ఐదు నిమిషాల పాటు ఆపేశాం. వాళ్ల శరీరాలు నీలి రంగులోకి మారడం మొదలైంది. ఇక వాళ్లు బతకడం కష్టమని చెప్పామని..ఆ తరువాత మిగతా 74 మంది పేషెంట్ల కుటుంబ సభ్యులకు వెళ్లి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకోవాలని చెప్పాం’’ అని అరింజయ్ అన్నట్లుగా వీడియోలో రికార్డయింది.

కానీ వీడియోలో ఉన్నది నా మాటలు కాదనీ..అరింజయ్ అంటున్నారు. పరిస్థితి విషమించిన వారిని గుర్తించామని వారికి మరింత మెరుగైన చికిత్స ఇవ్వటానికే మాక్ డ్రిల్ చేశామని అంటున్నారు. ఏప్రిల్ 26న నలుగురు, మర్నాడు మరో ముగ్గురు కరోనా పేషెంట్లు చనిపోయారని చెప్పిన ఆయన ఏప్రిల్ 26న 22 మంది చనిపోయారా? అని ప్రశ్నకు మాత్రం మరణాలపై కచ్చితమైన సంఖ్య తెలియదని మాట మార్చేశారు.

ఈ దారుణ ఘటన వెలుగులోకి రావటంపై ఆగ్రా జిల్లా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ ఆర్సీ పాండే మాట్లాడుతూ..దీనిపై విచారణకు ఆదేశించామని.. ఓ కమిటీ వేశామని తెలిపారు. ఆసుపత్రి ఐసీయూ చాలా పెద్దది కావడంతో మరేదైనా కారణాలతో రోగులు ప్రాణాలు పోయి ఉండవచ్చని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు ఎన్. సింగ్ అంచనా వేశారు. ఈ ఘటనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ పాలనలో ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండాపోతోందనీ..కరోనా తీవ్రత ఇలా ఉంటే కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు.

ఆక్సిజన్ కోసం పదే పదే ఫిర్యాదులు చేసినా ప్రభుత్వానికి పట్టటంలేదనీ..కానీ రోగులకు సరిపడా ఆక్సిజన్ అందబాటులో ఉందని ప్రభుత్వం అబద్దాలు చెప్పి ప్రజల ప్రాణాలు తీస్తోందని విమర్శలు చేశారు. ప్రాణాలు నిలుపుకోవటానికి ఆసుపత్రికి వస్తే ఇంతమంది ప్రాణాలు తీసిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.