Corona Cases : కేరళలో 22,946.. ఢిల్లీలో 12,527 కొత్త కరోనా కేసులు

కేరళలో కొత్తగా 22,946 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో కొత్తగా 12,527 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Corona Cases : కేరళలో 22,946.. ఢిల్లీలో 12,527 కొత్త కరోనా కేసులు

Corona

new corona cases in Kerala and Delhi : భారత్ లో మళ్లీ కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకూ భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కొత్తగా 12,527 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి 24 మంది మృతి చెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 83,982 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో కొత్తగా 22,946 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజులో 18 మంది చనిపోయారు.

నిన్న దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,71,202 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం కరోనా బారిన పడి 314 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజు వారీ పాజిటివిటీ రేటు ముందుటి రోజు పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28కి చేరింది.

Cabinet Key Decision : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. ఫీజుల నియంత్రణ, విద్యా బోధనకు నూతన చట్టం

మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది. దేశంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,030కు చేరింది.

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ దశకు చేరిందని ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సర్వీసెస్ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ సోకిన వారిలో 60.9శాతం మందికి విదేశాల నుంచి వచ్చిన ట్రావెల్ రికార్టు లేదని, భారత్ లోనే ఇతరుల నుంచి వారికి ఈ వేరియంట్ సోకినట్లు తెలిపింది.