Corona Cases : మళ్లీ విజృంభించిన కరోనా.. దేశంలో కొత్తగా 236 కేసులు నమోదు

దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Corona Cases : మళ్లీ విజృంభించిన కరోనా.. దేశంలో కొత్తగా 236 కేసులు నమోదు

CORONA

Corona Cases : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 4,41,42,989 మంది వైరస్ నుంచి కోలుకున్నారని పేర్కొంది. మరో 5,30, 693 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం 3424 యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.

మొత్తం కేసుల్లో 0.01 శాతం యాక్టివ్ గా ఉండగా, 98.80 శాతం మంది కోలుకున్నారని తెలిపింది. కరోనా బారిన పడి 1.19 శాతం మంది మృతి చెందారని చెప్పింది. గత 24 గంటల్లో 1,11,304 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని పేర్కొంది. ఇప్పటివరకు 2,20,05,16,249 కరోనా టీకాలను పంపిణీ చేశామని వివరించింది.

China Corona Cases : చైనాలో కరోనా విలయ తాండవం.. ఆ ఒక్క సిటీలోనే ప్రతి రోజు 5 లక్షల కేసులు నమోదు

చైనాలో లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆ దేశంలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోకి బీఎఫ్ 7 వేరియంట్ ప్రవేశించింది. దేశంలో మూడు బీఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. గుజరాత్ లో రెండు, ఒడిశాలో ఒకటి చొప్పున నమోదు అయ్యాయి.