China :24వేల టెస్టింగ్ కిట్ లు వాపస్…అన్యాయమంటున్న చైనా

ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

China :24వేల టెస్టింగ్ కిట్ లు వాపస్…అన్యాయమంటున్న చైనా

ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం…చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు మరిన్ని టెస్టింగ్‌ కిట్ల కొనుగోలు ఆర్డర్లను రద్దు చేసుకున్నట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ తెలిపారు.

కాగా,ఇటీవల చైనాకి చెందిన రెండు కంపెనీలు- గువాంగ్జో వాండ్ఫో బయోటెక్, జుహాయ్ లివ్జోన్ డయాగ్నోస్టిక్స్ నుంచి ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను భారత్ దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, రాజస్తాన్‌తో పాటు మరో మూడు రాష్ట్రాలు చైనా టెస్టింగ్‌ కిట్ల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశాయి. టెస్టింగ్‌ కిట్ల ద్వారా కరోనా వైరస్‌ నిర్ధారణ 5.4 శాతం మాత్రమే కచ్చితత్వాన్ని కలిగి ఉందని రాజస్తాన్‌ తెలిపింది. దీంతో రాష్ట్రాలు దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లు వాడవద్దని ఇటీవల ఐసీఎంఆర్ సూచించిన విషయం తెలిసింది.

ఈ నేపథ్యంలో వాటిని ఆయా కంపెనీలకు తిప్పి పంపేందుకు భారత పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) సిద్ధమైంది. ఇదిలాఉండగా.. చైనా టెస్టింగ్‌ కిట్లకు తమిళనాడు ప్రభుత్వం అధిక ధరలు చెల్లించిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే, భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలనే తామూ చెల్లించామని ప్రభుత్వం తెలిపింది. సరైన అవగాహన లేకుండా డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటన చేశారని తమిళనాడు సీఎంవో తెలిపింది.

మరోవైపు తమిళనాడులో అధికసంఖ్యలో కరోనా పేషెంట్లు కోలుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు. 56.8శాతం రికవరీ కేసులున్నాయని, మరణాల రేటు కేవలం 1.2శాతం మాత్రమే ఉన్నట్లు ఆయన తెలిపారు. కాగా,కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి.

అయితే తాము తయారు చేసిన కోవిడ్-19 టెస్ట్ కిట్ల వాడకాన్ని భారత్ నిలిపివేయడంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా నుండి ఎగుమతి చేసే వైద్య ఉత్పత్తుల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, కొంతమంది వ్యక్తులు చైనీస్ ఉత్పత్తులను “తప్పు” అని లేబుల్ చేయడం మరియు ముందస్తు పక్షపాతంతో సమస్యలను చూడటం అన్యాయం మరియు బాధ్యతారాహిత్యం అని చైనా ఎంబసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత సమస్యకు సంబంధించి భారతదేశం…. చైనా యొక్క సద్భావన మరియు చిత్తశుద్ధిని గౌరవించగలదని తాము ఆశిస్తున్నామని, వాస్తవాల ఆధారంగా సంబంధిత చైనా కంపెనీలతో సమయానుసారంగా కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయగలదని మరియు దానిని సహేతుకంగా మరియు సరిగ్గా పరిష్కరించగలదని చైనా ఎంబసీ ప్రతినిధి జీ రోంగ్ ఆ ప్రకటనలో తెలిపారు.