ICMR Corona : దేశంలో 24శాతం మందికి కరోనా.. పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే.. ఐసీఎంఆర్ సంచలనం

దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే 27మందికి కరోనా సోకినట్లేనని వెల్లడించింది. పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని, 25.6 శాతం మంది ఆరోగ్య సిబ్బంది

ICMR Corona : దేశంలో 24శాతం మందికి కరోనా.. పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు బాధితులే.. ఐసీఎంఆర్ సంచలనం

Icmr Corona

ICMR Corona : దేశంలో కరోనా వ్యాప్తిపైన ఐసీఎంఆర్ సంచలన విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 24.1శాతం కరోనా సోకినట్లు సీరో సర్వేలో వెల్లడైనట్లు ప్రకటించింది. గతేడాది డిసెంబర్ ఈ ఏడాది జనవరి మధ్య ఐసీఎంఆర్ సీరో సర్వే నిర్వహించింది. ఒక్క కరోనా కేసు గుర్తిస్తే 27మందికి కరోనా సోకినట్లేనని వెల్లడించింది.

పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బాధితులే అని, 25.6 శాతం మంది ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడ్డారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే ఎక్కువమంది బాధితులున్నట్లు ఉన్నట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో సీరో సర్వే నిర్వహించింది ఐసీఎంఆర్. పదేళ్లు పైబడిన వారిలో కనీసం 400 మంది నమూనాలు సేకరించామని, వంద మంది ఆరోగ్య సిబ్బంది నమూనాలను పరీక్షించామని తెలిపింది.