Rohingya Refugees : అసోంలో 24మంది రోహింగ్యాలు అరెస్ట్

అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు.

Rohingya Refugees : అసోంలో 24మంది రోహింగ్యాలు అరెస్ట్

Rohingyas

Rohingya Refugees  అసోం రాష్ట్రంలోని గౌహతి రౌల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం 9 మంది రోహింగ్యా శరణార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరూ నకిలీ UNHCR(యునైటెడ్ నేషన్స్ హై కమినర్ ఫర్ రిఫ్యూజీస్)ఐడీ కార్డులతో దేశంలో తిరుగుతున్నట్లు గుర్తించారు. అగర్తలా-దియోఘర్ ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు చేస్తున్న సమయంలో వీరిని అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు మహిళలు,ముగ్గురు పురుషులు,ఓ చిన్నారి ఉన్నట్లు అధికారి తెలిపారు. జమ్మూకి చెందిన అమన్ ఉల్లాహ్ అనే భారతీయ పౌరుడు కూడా వీరితో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

కాగా,శుక్రవారం కూడా అసోంలోని బరద్ పూర్ లో 15మంది రోహింగ్యాలని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బరద్ పూర్ రైల్వే స్టేషన్ లో సిల్చార్-అగర్తలా రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో 15మంది రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరెవ్వరి దగ్గరా చెల్లుబాటు అయ్యే పత్రాలు(Valid Papers)లేవని..దేశంలోకి అక్రమ ప్రవేశం కింద వీరిపైన కేసు పెట్టినట్లు ఓ రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ నుంచి వీరందరూ అసోంకి వచ్చి ఇక్కడి నుంచి బంగ్లాదేశ్ కి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే వీరిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. కాగా,దక్షిణ అసోంలోని కరీమ్ గంజ్..బంగ్లాదేశ్ మరియు త్రిపుర సరిహద్దుని కలిగి ఉంటుంది.

మరోవైపు,రోహింగ్యాలతో సహా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నవారిని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తామని కేంద్ర హోంశాఖ ఇటీవల పార్లమెంట్ కి తెలిపిన విషయం తెలిసిందే.