Bharat Jodo Yatra: మోదీ ప్రభుత్వానికి 24 గంటలూ అదే పని.. కేంద్రంపై రాహుల్ ఫైర్

కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Bharat Jodo Yatra: మోదీ ప్రభుత్వానికి 24 గంటలూ అదే పని.. కేంద్రంపై రాహుల్ ఫైర్

24x7 Hindu, Muslim hatred is being spread says Rahul Gandhi at red fort

Bharat Jodo Yatra: దేశంలోని నిజమైన సమస్యలను దారి మళ్లించేందుకే హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటలూ ఇదే పనని, అంతకు మించి ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా శనివారం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రాహుల్ ప్రసంగంలోని హైలైట్స్..
ఇది ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం కాదు. అంబానీ-అదానీల ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఆ ఇద్దరే నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానా వారికి బ్యాంకు ఖాతాల్లోకే వెళ్తోంది.
ఈ యాత్ర ఉద్దేశం దేశాన్ని ఏకం చేయడం. కన్యాకుమారి నుంచి మేం యాత్ర ప్రారంభించినప్పుడు, దేశంలో ఉన్న ధ్వేషం తొలగిపోతుందని నేను అనుకున్నాను. దేశంలో ప్రతి నలుమూలల ధ్వేషాన్ని నింపారు. కానీ నేను యాత్ర ప్రారంభించగానే ధ్వేషం స్థానంలో ప్రేమ వచ్చి చేరింది.
దేశంలోని నిజమైన సమస్యలను ఎదుర్కోవడానికి బీజేపీ భయపడుతోంది. వాటిని దారి మళ్లించేందుకే హిందూ-ముస్లింల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవారి 24గంటల డ్యూటీ ఇదే.
ఒకరు కింద పడితే వెంటనే సాయం చేయడం ఈ దేశం యొక్క లక్షణం. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు వేరు. వారికి ధ్వేషం మాత్రమే తెలుసు. ఈ దేశం ఒక్కటే. ఈ దేశంలో ధ్వేషానికి చోటు ఉండకూడదు.
ఇక్కడ చూడండి (ఎర్ర కోట ప్రాంతాన్ని చూపిస్తూ). జైన్ మందిర్, గురుద్వారా, గుడి, మసీదు, చర్చి అన్నీ ఉన్నాయి. ఇది నిజమైన భారతదేశం.
ఎన్నో ఏళ్ల నుంచి చదువును నమ్ముకుని ఉన్న యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. డిగ్రీలు చేతిలో పట్టుకుని ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఎదురు చూపులే మిగిలాయి.
రైతులకైతే బ్యాంకు తలుపులు మూస్తారు. అదే కార్పొరెట్లకైతే లక్షల కోట్ల రుణాలు ఇస్తారు. ఒక్కొక్క వ్యాపార వేత్త లక్ష నుంచి మూడు లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. కొందరు అవి చెల్లించకుండా దేశం దాటేస్తున్నారు. ఆ రుణాల్ని ప్రభుత్వం ప్రజల నెత్తి మీద వేస్తోంది.
నోట్లరద్దు, జీఎస్టీ వంటివి ప్రభుత్వం తీసుకువచ్చింది. రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు బాగానే ఉన్నారు. చిన్న వ్యాపారులు, సామాన్యులు అనేక కష్టాలు పడ్డారు. ప్రభుత్వం చేస్తున్నవి విధానాలు కాదు, ఆయుధాలు. చిన్న, మధ్యతరహా వ్యాపారులతో పాటు రైతులను చంపడానికి ప్రభుత్వం రూపొందిస్తున్న ఆయుధాలు.
నేను 2,800 కిలోమీటర్ల మేర యాత్ర చేశాను. ఇది అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ రైతులు, కూలీలు కొన్ని వేల కిలోమీటర్లు నడుస్తున్నారు. ఒక్కక్కరు 15-20 వేల కిలోమీటర్లు నడుస్తున్నారు.