జామియా వర్శిటీ హింసలో డ్యామేజ్ బిల్లులో రూ. 2.66కోట్లు

10TV Telugu News

ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జరిగిన హింసలో రూ. 2.66కోట్ల విలువైన ఆస్తి దెబ్బలినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవెలప్‌మెంట్‌కు నివేదిక ఇచ్చింది యూనివర్శిటి గతేడాది డిసెంబర్ 15వ తేదీన క్యాంపస్ లోపల పోలీసుల చర్యల కారణంగా జామియా మిలియా ఇస్లామియా రూ. 2,66,16,390 ఆస్తిని కోల్పోయిందని విశ్వవిద్యాలయం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఆర్‌డి) తెలిపింది.

రూ .4.75 లక్షల విలువైన 25 సిసిటివి కెమెరాలు ద్వంసం అయినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. జామియాలో హింసాకాండకు సంబంధించిన పలు సిసిటివి ఫుటేజీలు కొద్ది రోజులుగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నష్టపోయిన మొత్తం ఎంత అనేదానిపై నివేదిక ఇచ్చింది యూనివర్శిటీ. 

యూనివర్శిటీలో జరిగిన ఆందోళన వీడియోలలో, యూనిఫాంలో ఉన్న విద్యార్థులు కర్రలతో ఉండడం కనిపిస్తుంది. ఈ హింసలో విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో సీసీటీవీ కెమెరాలు పగిలిపోయాయి. ఇందులో దొరికిన వీడియోలను పరిశీలించిన పోలీసులు అలాగే వైరల్ అవుతున్న వీడియోలు కొన్ని ఎడిటింగ్ చెయ్యపడినవి అని అంటున్నారు పోలీసులు. 

డిసెంబర్ 15, 2019 తేదీన ఢిల్లీ పోలీసుల చర్యల కారణంగా ఈ నష్టం జరిగిందని విశ్వవిద్యాలయం చెబుతోంది. భద్రతా సిబ్బంది అనుమతి లేకుండా పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించారని విశ్వవిద్యాలయం తెలిపింది. లైబ్రరీలో ఎక్కువ నష్టం గ్లాస్ పేన్లను పగలగొట్టడం వల్లనే జరిగిందని, వాటితో పాటు సీసీటీవీ కెమెరాలు, ట్యూబ్ లైట్లు, లైబ్రరీ పరికరాలు, తలుపులు, విండో గ్లాస్, ఎసీలు, కుర్చీలు, టేబుల్స్ మొదలైనవి డ్యామెజ్ అయినవాటిలో ఉన్నాయి. 

యూనివర్శిటీ ఇచ్చిన అంచనాల ప్రకారం రూ .55 లక్షల విలువైన పరికరాలు దెబ్బతినగా.. 75 తలుపులు ధర రూ .41.25 లక్షలు, 220 విండో పేన్‌ల విలువ రూ .22.5 లక్షలు, రైలింగ్ ఖర్చు 18 లక్షలు దెబ్బ తిన్నట్లుగా జామియా తెలిపింది. ఇవి కాక హింసాకాండలో రూ .15 లక్షల విలువైన హార్డ్‌వేర్, రూ .35 లక్షల విలువైన 35 లైబ్రరీ టేబుల్స్ దెబ్బతిన్నాయి.

10TV Telugu News