Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన 25 మంది సభ్యులకు కేరళ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సంచలనాత్మక తీర్పులో ఒక సెషన్ కోర్టు న్యాయమూర్తి ఒకేసారి 25 మందికి జీవిత ఖైదు విధించారు

Kerala Court: 25 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సభ్యులకు జీవిత ఖైదు విధించిన కేరళ కోర్టు

Palakkad

Kerala Court: కేరళ రాష్ట్రంలో ఇద్దరు అన్నదమ్ములను హతమార్చిన ఘటనలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన 25 మంది సభ్యులకు కేరళ సెషన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సంచలనాత్మక తీర్పులో ఒక సెషన్ కోర్టు న్యాయమూర్తి ఒకేసారి 25 మందికి జీవిత ఖైదు విధించారు. అంతే కాదు జైలు శిక్ష సహా ఈ 25 మంది నిందితులు ఒక్కొక్కరు రూ.1.15 లక్షలు జరిమానా చెల్లించాలని, వచ్చిన మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని కోర్టు ఆదేశించింది. 2013 కేరళలోని పాలక్కాడ్ లో జరిగిన ఈ జంట హత్యల ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. నూరుద్దీన్, హంసా, కుంజు ముహమ్మద్ అనే ముగ్గురు అన్నదమ్ములు కేరళలోని AP సున్నీ పార్టీ మద్దతుదారులు. పాలక్కాడ్ లో ఓ మసీదు నిర్మాణం నిమిత్తం విరాళాల సేకరణ విషయంలో ఈ ముగ్గురు అన్నదమ్ములకు మరియు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) సభ్యులకు మధ్య 2013లో వివాదం తలెత్తింది. ఈక్రమంలో IUMLకు చెందిన కొందరు వ్యక్తులు నూరుద్దీన్, హంసా, కుంజు ముహమ్మద్ లపై కత్తులతో దాడికి పాలపడ్డారు.

Other Stories: South West Monsoon : అండమాన్ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు

ఈ దాడుల్లో నూరుద్దీన్, హంసా అక్కడిక్కడే మృతి చెందగా కుంజు ముహమ్మద్ స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈఘటనపై పాలక్కాడ్ పోలీసులు కేసు నమోదు చేసి 25 మంది IUML సభ్యులను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో ఈ జంట హత్యలకు సంబందించి తొమ్మిదేళ్ల అనంతరం మే12న 25 మంది IUML సభ్యులను దోషులుగా గుర్తించిన సెషన్ కోర్ట్ జడ్జి రజిత టి హెచ్, సోమవారం తీర్పు వెలువరించింది. హత్య కేసులో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 25 మంది దోషులకు జీవిత ఖైదు విధించింది. అదే సమయంలో కుంజు ముహమ్మద్ పై జరిగిన దాడిని హత్యాయత్నంగా పేర్కొంటూ సెక్షన్ 307 ప్రకారం మరో మూడేళ్లు జైలు శిక్ష విధించింది కోర్ట్.