ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల విలువైన బంగారం పట్టివేత

కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

  • Published By: veegamteam ,Published On : May 14, 2019 / 06:54 AM IST
ఎయిర్ పోర్టులో రూ.9 కోట్ల విలువైన బంగారం పట్టివేత

కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి దగ్గర నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మే 13వ తేదీ మస్కట్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు రూ.8.5 కోట్ల విలులైన 25 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ స్టేట్ తిరుమలకు చెందిన సునీల్ అనే ప్రయాణికుడు.. మస్కట్ నుంచి ఒమన్ విమానంలో త్రివేండ్రమ్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతను భారీగా బంగారం తరలిస్తున్నారనే సమచారంతో సదరు వ్యక్తిని అధికారులు తనీఖీలు చేశారు. అల్యూమినియం రేకులు చుట్టి ఉన్న బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు  సునీల్ ను అదుపులోకి  విచారిస్తున్నారు. వారం క్రితమే.. త్రివేండ్రం విమానాశ్రయంలో మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణీకుడి నుంచి రూ.18లక్షల విలువగల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.