Pratiksha Das Bus Driver : పాతికేళ్ల ఈ మెకానికల్ ఇంజినీర్ అమ్మాయి.. ముంబైలో తొలి మహిళా బస్సు డ్రైవర్

రోజులు మారాయి. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. బైకులే కాదు కార్లు కూడా అవలీలగా నడుపుతున్నారు. కొందరు అమ్మాయిలు పెద్ద పెద్ద వాహనాలను సైతం సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నారు. అయితే మన దేశంలో ట్రక్కులు, బస్సులు లాంటి హెవీ కమర్షియల్ వెహికల్స్ నడిపే అమ్మాయిలను చూడి ఉండరు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ప్రతీక్ష దాస్ అనే పాతికేళ్ల వయసున్న అమ్మాయి ట్రెండ్ సెట్ చేసింది. మెకానికల్ ఇంజినీర్ అయిన ఈ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ముంబైలో తొలి బస్సు డ్రైవర్ గా ఘనత సాధించింది.

Pratiksha Das Bus Driver : పాతికేళ్ల ఈ మెకానికల్ ఇంజినీర్ అమ్మాయి.. ముంబైలో తొలి మహిళా బస్సు డ్రైవర్

Pratiksha Das Bus Driver

Pratiksha Das Mumbais First Woman Bus Driver : రోజులు మారాయి. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపేస్తున్నారు. బైకులే కాదు కార్లు కూడా అవలీలగా నడుపుతున్నారు. కొందరు అమ్మాయిలు పెద్ద పెద్ద వాహనాలను సైతం సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తున్నారు. అయితే మన దేశంలో ట్రక్కులు, బస్సులు లాంటి హెవీ కమర్షియల్ వెహికల్స్ నడిపే అమ్మాయిలను చూడి ఉండరు. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ప్రతీక్ష దాస్ అనే పాతికేళ్ల వయసున్న అమ్మాయి ట్రెండ్ సెట్ చేసింది. మెకానికల్ ఇంజినీర్ అయిన ఈ అమ్మాయి రికార్డు నెలకొల్పింది. ముంబైలో తొలి బస్సు డ్రైవర్ గా ఘనత సాధించింది.

మహారాష్ట్రలోని మలాడ్ లో ఉనన థాకూర్ కాలేజీలో ప్రతీక్ష మెకానికల్ ఇంజినీరింగ్ చదివింది. బృహణ్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్టు(BEST) లో బస్సు డ్రైవర్ గా అపాయింట్ అయ్యింది. ఆమె వయసు కేవలం 25ఏళ్లే. ఆ అమ్మాయి చూడటానికి చాలా జాలీగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు, సెల్లూన్లకు వెళ్లేలా కనిపిస్తుంది. కానీ పెద్ద వాహనం నడిపే సత్తా ఉందని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు.

”నాకు హెవీ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. భారీ వాహనాలు నడపాలని ఎప్పటి నుంచో కోరిక. దీని కోసం గత ఆరేళ్లుగా పని చేస్తున్నా. ముందుగా బైకులు నడిపాను. తర్వాత పెద్ద పెద్ద కార్లు నడిపా. ఇప్పుడు బస్సులు, ట్రక్కులు నడుపుతున్నా. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది” అని ప్రతీక్ష అంటుంది.

ఆర్టీవో ఆఫీసర్ అవ్వాలని ప్రతీక్ష అనుకుంది. అయితే హెవీ వెహికల్స్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ ఇందుకు అవసరం. ఆ జాబ్ తనకు ఫర్ ఫెక్ట్ అని అనుకుంది. ఎందుకంటే బస్సులు నడపడం అంటే తనకు చాలా ఇష్టం. 8వ క్లాస్ లో ఉన్నప్పుడు తన అంకుల్ మోటర్ సైకిల్ ని నడిపింది. ఇది చూసి ఆమె మామ ఆశ్చర్యపోయాడు. రెండు రోజుల్లో మోటార్ సైకిల్ నడపడం ఎలా నేర్చుకున్నావని అడిగారు.

ప్రతీక్ష ఫాస్ట్ లెర్నర్ గా గుర్తింపు పొందింది. ఆమెకి బస్సు నడిపే ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ట్రైనర్ బాగా కంగారుపడ్డాడు. ప్రతీక్ష బస్సు నడుపుతుందో లేదో అని కంగారుపడ్డారు. బస్సు నడపాలంటే చాలా బలం కావాలి. కారు నడిపినంత సులువు కాదు. బస్సుని టర్న్ చేయాలంటే చాలా కష్టం. ఇక ప్రతీక్ష ఎత్తు 5.4. దీంతో ఆమెకు ట్రైనింగ్ ఇచ్చే వారు.. నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు. నువ్వు బస్సుని నడపగలవా? అని ప్రశ్నించే వారు. నేను అన్ని రకాల బైక్ లు, రేస్ కార్లు నడపగలను అని ప్రతీక్ష బదులిచ్చేది.

తొలుత బస్సు నడిపే సమయంలో కొన్ని ఇబ్బందులు పడ్డాను. లేన్స్ చేంజ్ చేసేటప్పుడు, టర్న్ తీసుకునే సమయంలో ఇబ్బందులు పడ్డాను. కానీ, 15 రోజుల్లో అన్నీ నేర్చుకుంది. బస్సు 36 ఫీట్ పొడవు ఉంటుంది. దాన్ని టర్న్ చేయడం అంత ఈజీ కాదు. టర్న్ తీసుకునే ముందు అద్దంలో చూడాలి. ఆ అద్దం బైక్ అద్దం కన్నా చిన్నగా ఉంటుంది. అయితే 15 రోజుల్లోనే నైపుణ్యం సాధించాను. ట్రైనర్ శిక్షణ లేకుండానే బస్సుని నేనే స్వయంగా టర్న్ చేయగలిగాను అని ప్రతీక్ష చెప్పింది. ప్రతీక్ష టెస్టు పాసయ్యాక, ట్రైనర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతేకాదు ఓ అమ్మాయి టెస్టు పాస్ కావడాన్ని థ్రిల్ గా ఫీల్ అయ్యారు.

ప్రతీక్ష.. ఆసియా రోడ్ రేసింగ్ చాంపియన్ షిప్ 2019లో కూడా పాల్గొంది. అంతేకాదు మోటార్ సైకిల్ రేసర్ కూడా. హోండా, టీవీస్ రేసుల్లోనూ పాల్గొంది. రెండు టీవీఎస్ రేసింగ్ చాంపియన్ షిప్ ట్రోఫీలను గెలుచుకుంది. ఫాస్టెస్ట్ ఫీమేల్ ఇండియా స్పీడ్ వీక్ డ్రాగ్ రేస్ 2019 టైటిల్ విన్నర్ కూడా.