Sabarimala : శబరిమల దర్శనానికి ప్రతి రోజు 25,000 మంది భక్తులకు అనుమతి

ఇక ఈ నేపథ్యంలోనే దేవభూమి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 25వేల మంది భక్తులను అనుమతిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

Sabarimala : శబరిమల దర్శనానికి ప్రతి రోజు 25,000 మంది భక్తులకు అనుమతి

Sabarimala

Sabarimala : దేశ వ్యాప్తంగా కోవిడ్-19 ఉదృతి తగ్గడంతో పుణ్యక్షేత్రాల్లో క్రమంగా కరోనా నిబంధనలు తొలగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే దేవభూమి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 25వేల మంది భక్తులను అనుమతిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. కాగా గతేడాది వేయి మందిని మాత్రమే అనుమతించారు.

చదవండి : Sabarimala Temple: దర్శనానికి 9 ఏళ్ల బాలిక.. అనుమతిచ్చిన కేరళ హైకోర్ట్

శబరిమల దర్శనాలకు సంబంధించి దక్షిణాది ఐదు రాష్ట్రాల అధికారులతో కేరళ ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కరోనా ఉధృతి చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులకు అనుమతిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది.

చదవండి : Sabarimala Ayyappa Temple : ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

శబరిమల ఆలయ పరిసరాలలో ఎలాంటి ప్లాస్టిక్‌ వస్తువులనూ అనుమతించరు. ఇక పంబానది స్నానం ఈ ఏడాది కూడా లేదని ప్రభుత్వం తెలిపింది.. నది వెంబడి ఏర్పాటు చేసిన షవర్ల కిందే స్నానం చేయాలనీ సూచించింది. దర్శనానికి 72 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకున్న వారికే దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు.