రోజుకు 26వేల టన్నులు: ఇండియాను పట్టిపీడుస్తున్న ‘ప్లాస్టిక్’ భూతం

నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. చెత్తకుప్పలపై వాడిపారేసిన ప్లాస్టిక్ తో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. డ్రైనేజీలు, నది ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

  • Published By: sreehari ,Published On : January 25, 2019 / 08:17 AM IST
రోజుకు 26వేల టన్నులు: ఇండియాను పట్టిపీడుస్తున్న ‘ప్లాస్టిక్’ భూతం

నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. చెత్తకుప్పలపై వాడిపారేసిన ప్లాస్టిక్ తో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. డ్రైనేజీలు, నది ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద తలనొప్పిగా మారాయి.

నగరాల్లో రోడ్లపై ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలే. చెత్తకుప్పలపై వాడిపారేసిన ప్లాస్టిక్ తో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా కనిపిస్తుంటాయి. డ్రైనేజీలు, నది ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద తలనొప్పిగా మారాయి. చెత్తకుప్పల దగ్గర భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ ను మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్న దారుణ పరిస్థితి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలంటూ ఎంత మొత్తుకున్నా వింటేనా? ప్లాస్టిక్ పై నిషేధం విధించిన గుట్టుచప్పుడు కాకుండా దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేయడం.. వాటిని రోడ్లపై చెత్తకుప్పల్లో పారేయడంతో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఒకవైపు స్వచ్ఛ భారత్ అంటూ క్లీనింగ్ ప్రొగ్రామ్స్ నిర్వహిస్తున్నప్పటీకీ ఈ ప్లాస్టిక్ భూతం వదిలిపెట్టేలా లేదు.

ఈ ప్లాస్టిక్ వినియోగం కారణంగా జంతువులకే కాదు.. మనుషుల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని తెలుసా? డ్రైనేజీలో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, సముద్రాల్లో చేరి నీటి కాలుష్యానికి గురవుతుంటే.. ప్లాస్టిక్ కాల్చడం ద్వారా వచ్చే పొగతో వాయు కాలుష్యం.. ఇలా ఎన్నో సమస్యలతో ప్లాస్టిక్ భూతం భారత్ ను పట్టిపీడుస్తోంది. గతకొన్ని ఏళ్లుగా వ్యర్థాలను రీసైకిలింగ్ చేయడంలో భారత్ మెరుగుపడిందనే చెప్పాలి. ఇతర వ్యర్థ పదార్థాలతో పాటు ప్లాస్టిక్ ను కూడా రీసైకిలింగ్ చేస్తోంది. కానీ, ఎంత మొత్తంలో ప్లాస్టిక్ పుట్టుకోస్తోంది. కొద్దిమొత్తంలో మాత్రమే రీసైకిలింగ్ జరుగుతుందనేది అక్షర సత్యం. ఇటీవల సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) ప్లాస్టిక్ వ్యర్థాలపై నిర్వహించిన సర్వేలో షాకింగ్ గణాంకాలను విడుదల చేసింది. 

ఒక్క భారత్ లోనే రోజుకు 26 వేల టన్నుల కొద్ది ప్లాస్టిక్ పుట్టకోస్తుందంటే నమ్ముతారా? అవును. భారత్ లో ప్రతిరోజు సింగల్ యూజ్ లోనే దాదాపు 25,940 టన్నుల ప్లాస్టిక్ జనరేట్ అవుతోందట. ఇందులో 40 శాతం మాత్రం డ్రైనేజీలు, నదుల్లోకి చేరడంతో ప్లాస్టిక్ ను తొలగించడం కష్టసాధ్యంగా మారుతోంది. దేశంలోని 60 ప్రధాన నగరాల్లో ఈ ప్లాస్టిక్ భూతం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 50 శాతానికి పైగే ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయని సీపీసీబీ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. 25,940 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల్లో 15,564 (60 శాతం) మాత్రమే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుండగా.. మిగతా 10,376 టన్నుల ప్లాస్టిక్ (40 శాతం) వరకు వ్యర్థంగా నదులు, సముద్ర ప్రాంతాల్లో మిగిలిపోయి రీసైకిలింగ్ కావడం లేదు. దీంతో పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని సీపీసీబీ హెచ్చరిస్తోంది.

మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను విదేశాల నుంచి భారత్ భారీగా రీసైకిలింగ్ స్క్రాప్ ను ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇందుకోసం ఆర్థిక సంవత్సరం 2016-17లో భారత్ 12వేల మెట్రిక్ టన్నుల (ఎంటీ) పెట్ బాటిల్ స్ర్ర్కాప్ ను ఇంపోర్ట్ చేసింది. ఆర్థిక సంవత్సరం 2017-2018 కి (290 శాతం) 48వేల మెట్రిక్ టన్నుల వరకు పెరిగింది. తొలి మూడు నెలల్లో (2018-2019) ఏడాదిలో భారత్ 25వేల మెట్రిక్ టన్నులు ఇంపోర్ట్ చేసింది. భారత కు ప్లాస్టిక్ స్ర్కాప్స్ ఇంపోర్ట్ చేయడాన్ని పీడీయూఎస్ఎం అధ్యక్షులు వినోద్ శుక్లా వ్యతిరేకిస్తూ ఇటీవల క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ క్యాంపెయిన్ లో ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనార్థాలను ఆయన వివరించారు.