Corona Vaccination : భారత్‌లో 27.66 కోట్ల డోసుల కరోనా టీకాలు పంపిణీ

ఇక హెల్త్ వర్కర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1,01,19,241 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 70,85,889 మంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 1,71,08,593 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 90,32,813 మంది ఉన్నారు.

Corona Vaccination : భారత్‌లో 27.66 కోట్ల డోసుల కరోనా టీకాలు పంపిణీ

Corona Vaccination (2)

Corona Vaccination: దేశంలో గత ఐదు నెలలుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. ఇక ఇప్పటి వరకు దేశంలో 27,66,93,572 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక 24 గంటల్లో 38 లక్షల వ్యాక్సిన్ డోసులను ఆయా రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.

టీకా తీసుకున్న వారు.

ఇక హెల్త్ వర్కర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్నవారి సంఖ్య 1,01,19,241 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 70,85,889 మంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కేటగిరిలో మొదటి డోస్ తీసుకున్న వారు 1,71,08,593 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 90,32,813 మంది ఉన్నారు. ఇక 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 5,42,210,110 మంది కాగా రెండవ డోస్ తీసుకున్న వారు 12,27,088 మంది ఉన్నారు.

45 నుంచి 59 మధ్య వయసు వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 7,98,16,559 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్నవారు 1,26,54,117 మంది. ఇక 60 ఏళ్ళు పైబడిన వారిలో మొదటి డోస్ తీసుకున్న వారు 6,44,21,583 మంది కాగా, రెండవ డోస్ తీసుకున్న వారు 2,10,26,579 మంది ఉన్నారు. ఇక జూన్ 20 వరకు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 27,66,93,572 గా ఉంది.