Covid-19: సెకండ్ వేవ్ దాటికి 270 మంది వైద్యులు మృతి

కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్యులు మృతి చెందినట్లు మంగళవారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలిపింది.

Covid-19: సెకండ్ వేవ్ దాటికి 270 మంది వైద్యులు మృతి

Covid 19 (5)

Covid-19: కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. ఇక దేశం ఆక్సిజన్ షార్టేజిని అధిగమిస్తుంది. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ లో కరోనా బారినపడి 270 మంది వైద్యులు మృతి చెందినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మంగళవారం తెలిపింది. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వైద్యులు కూడా ఉన్నారు. ఐఎంజీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కేకే అగర్వాల్ సైతం కరోనాతో మృతి చెందారు.

ఇప్పటి వరకు బిహార్‌లో అత్యధికంగా 78 మంది, ఉత్తరప్రదేశ్‌లో 37 మంది, ఢిల్లీలో 29 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది మరణించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డాక్టర్ల మరణాలు నమోదైనట్లు ఐఎంఏ తెలిపింది. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రిజిస్ట్రీ ప్రకారం మొదటి వేవ్‌లో 748 మంది వైద్యులు వైరస్‌ బారినపడి ప్రాణాలు విడిచారు.

ఇక సెకండ్ వేవ్ లో 270 మంది మృతిచెందారు. కరోనా మహమ్మారికి గత ఏడాది కాలంలో 1018 మంది వైద్యులు మృతి చెందారు. వైద్యుల మృతిపై ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ జేఏ జయలాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహమ్మారి రెండో దశ అందరికీ.. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులకు చాలా ప్రాణాంతకంగా మారుతోందని పేర్కొన్నారు. వైద్య విభాగంలో పనిచేస్తూ మృతి చెందిన సిబ్బంది సంఖ్య వేలల్లోనే ఉందని తెలిపారు.