కేఫే కాఫీ డే ఫౌండర్ ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు…2వేల కోట్లు మిస్సింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : March 16, 2020 / 12:06 PM IST
కేఫే కాఫీ డే ఫౌండర్ ఆత్మహత్య వెనుక షాకింగ్ నిజాలు…2వేల కోట్లు మిస్సింగ్

గతేడాది జులైలో కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్ధార్థ కర్ణాటకలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య కేసులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్ధార్థ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కాఫీడే బోర్డు దర్యాప్తు చేపట్టింది.

ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేఫ్‌ కాఫీ డే బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే దాదాపు రూ.2000 కోట్లకు సంబంధించి లెక్కలు తేలలేదని తెలుస్తోంది. దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే ఈ నివేదికను బయటపెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా సిద్దార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లు ఒక లేఖ బయటపడిన విషయం తెలిసిందే. 

అందులో ఓ పారిశ్రామిక వేత్తగా తాను విఫలమయ్యానని, కంపెనీ ప్రతి ఆర్థిక లావాదేవీకి తనదే బాధ్యతని, తాను నిర్వహించిన లావాదేవీల వివరాలు కాపీ డే బోర్డు, ఆడిటర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు కూడా తెలియదని అందులో తెలిపారు. అయితే ఇప్పుడు కాఫీ డే బోర్డు జరిపిన దర్యాప్తులో వందల కొద్ది లావాదేవీలను కొన్ని నెలలపాటు దర్యాప్తు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో తేడాలున్నట్లు గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డే, వీజీ సిద్ధార్థకు చెందిన ప్రైవేట్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు.

Also Read | హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు ?