24 గంటల్లో 9985 మందికి కరోనా‌.. 274 మంది మృతి: కరోనా విలయం

  • Published By: nagamani ,Published On : June 10, 2020 / 04:50 AM IST
24 గంటల్లో 9985 మందికి కరోనా‌.. 274 మంది మృతి: కరోనా విలయం

చైనా నుంచి ప్రబలిన కరోనా భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఇప్పటికీ హడలెత్తిస్తూనే ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో భారత్ లో గత 24 గంటల్లో 9985 మందికి కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం (జూన్ 10,2020) వెల్లడించింది. వీరిలో 24 గంటల్లోనే 279 మంది కూడా మరణించినట్లు తెలిపింది. 

దీంతో దేశవ్యాప్తంగా మొత్తం వైరస్‌ కేసుల సంఖ్య 2 లక్షల 76 వేల 583లకు చేరుకుంది. దీంట్లో 1 లక్షా 33వేల 632 కేసులు యాక్టివ్‌గా ఉండగా..1 లక్షా 35వేల 206 కేసులు రికవర్‌ అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ తో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 7 వేల 745గా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. 

కాగా..కరోనా వైరస్‌ శ్యాంపిల్‌ పరీక్షలు దేశంలో 50 లక్షలు దాటినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.  గత 24 గంటల్లో దేశంలో 1 లక్షా 42వేల 216 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించామని వెల్లడించింది.   భారత్‌లో రికవరీ కేసుల సంఖ్య కూడా పెరగటం సంతోషంచాల్సిన విషయం. దేశంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల కన్నా.. రికవరీ కేసులు ఎక్కువగానే ఉణ్నాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.  ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 48.9 శాతంగా ఉన్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.