భారత్‌లో కరోనా విజృంభణ, 28 కేసులు నమోదు, రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 07:36 AM IST
భారత్‌లో కరోనా విజృంభణ, 28 కేసులు నమోదు, రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ అధికారిక ప్రకటన చేశారు. 12మంది భారతీయులు, 16మంది విదేశీయులకు కరోనా సోకిందని చెప్పారు. భారత పర్యటనకు వచ్చిన 16మంది ఇటలీ దేశీయులకు కరోనా సోకినట్టు నిర్ధారించారు. 14మంది పర్యాటకులను తీసుకెళ్లిన డ్రైవర్ కు కూడా కరోనా సోకింది. ఢిల్లీలో 14మందికి, జైపూర్ లో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. 

కరోనా రోగి నుంచి మరో ఆరుగురికి వైరస్:
ఢిల్లీలో కరోనా రోగి నుంచి మరో ఆరుగురికి కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆగ్రాలోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఆ ఆరుగురికి ఆగ్రా ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా కేరళలోని ముగ్గురు మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. ఇంతలోనే కరోనా కేసులు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వైరస్ ఉంటోంది. వారి కారణంగా ఇక్కడ వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ పట్ల అన్ని రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండాలని, వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రభుత్వాలను కోరారు.

80 దేశాల్లో కరోనా కల్లోలం:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటివరకు 80కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 90వేల మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. 3వేల 500 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. దీంతో అంతా హడలిపోతున్నారు. మన దేశంలోనూ కరోనా విజృంభణతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లో కరోనా విస్తరించడకుండా చర్యలు చేపట్టింది. పలు దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించేవారిపై కఠిన అంక్షలు విధిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు చేసింది.(హైదరాబాద్ టెకీ కలిసిన ఆ 36 మందికి కరోనా సోకింది!)

వీసాలు రద్దు, విదేశీయులపై ఆంక్షలు:
మార్చి 3వ తేదీకి ముందు ఇటలీ, ఇరాన్‌, దక్షిణ కొరియా, జపాన్‌ దేశస్థులకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునే వారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది. చైనా దేశీయులకు ఫిబ్రవరి 5కు ముందు వరకు జారీ చేసిన రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రం. ఆ నిర్ణయం ఇంకా కొనసాగుతుందని కొత్త నిబంధనల్లో వెల్లడించింది. అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.
 
ఫిబ్రవరి 1 తర్వాత చైనా, ఇరాన్‌, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్‌ దేశాలకు వెళ్లిన విదేశీయుల రెగ్యులర్‌, ఈ వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఆ జాబితాలో ఎవరైనా అత్యవసర కారణాలతో భారత్‌ రావాలనుకునేవారు సమీపంలోని భారత ఎంబసీని సంప్రదించి కొత్త వీసాలను పొందాలని సూచించింది.

* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు
* భారత్ లో 28 కరోనా పాజిటివ్ కేసులు
* అధికారికంగా ప్రకటించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్
* ఢిల్లీ, తెలంగాణ, ఆగ్రా, జైపూర్ లలో కరోనా పాజిటివ్ కేసులు
* ఇటలీ నుంచి వచ్చిన 21 మందిలో 16మందికి కరోనా
* 16 మంది ఇటాలియన్ టూరిస్టులకు కరోనా

* ఇటలీ నుంచి వచ్చిన ఒక భారతీయుడికి కరోనా పాటిజివ్
* ఆరుగురు ఆగ్రవాసులకు కొవిడ్ పాజిటివ్
* చావ్లాలోని ఐసోలేషన్ వార్డులకు తరలింపు
* విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్ టెస్టులు మస్ట్
* ఇప్పటివరకు 5 లక్షల 57వేల 657మందికి స్క్రీనింగ్ పరీక్షలు
* అయినా భయం అక్కర్లేదన్న కేంద్రం
* ఆగ్రాలో-6, కేరళలో-3, తెలంగాణ-1 కేసులు నమోదు