తాగు నీటి కోసం మహిళలు ప్రతి రోజు 2 కిలోమీటర్లు కాలినడక

  • Published By: srihari ,Published On : May 29, 2020 / 01:26 PM IST
తాగు నీటి కోసం మహిళలు ప్రతి రోజు 2 కిలోమీటర్లు కాలినడక

దేశవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలతో మండిపోతున్న ప్రజలకు నీటి కొరత తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మధ్యప్రదేశ్ లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది.సెహోర్ లోని పట్నిలో మహిళలు తాగునీరు, ఇతర అవసరాల కోసం ప్రతి రోజు 2 కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్తున్నారు. 

ప్రమాదకరంగా ఉన్న బావిలోకి దిగి డబ్బాలు, బిందెలతో నీటిని తోడుకుంటున్నారు. మహిళలు మండుటెండలో నెత్తపై బిందెలు, డబ్బాలు మోసుకెళ్తుండగా, పురుషులు డ్రమ్ముల్లో నీటిని నింపుకుని వాటిని ఎడ్లబండికి తగిలించుకుని తీసుకెళ్తున్నారు.

గ్రామస్తుడు మీడియాతో తమ గ్రామంలో నీళ్లు లేవని వాపోయాడు. ఎండలు అధికమవుతుండటం, నీరు లేకపోవడంతో రోజూవారి జీవితం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2 కిలో మీటర్లు నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవడం తప్ప వేరే మార్గం లేదన్నారు. దయచేసి తమ సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోడీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను కోరుతున్నట్లు తెలిపారు.