Oman Beach : ఒమ‌న్ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు భార‌తీయులు..తండ్రి, బాలుడి మృత‌దేహాలు ల‌భ్యం

20 ఏండ్ల నుంచి దుబాయ్‌లోనే శ‌శికాంత్‌ త‌న కుటుంబంతో క‌లిసి ఉంటున్నాడు. దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బ‌క్రీద్ రోజు సెల‌వు కావ‌డంతో.. త‌న భార్య సారిక‌, ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఒమ‌న్ స‌ముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో ఎంజాయ్ చేస్తుండ‌గా రాక‌సి అల‌లు దూసుకొచ్చాయి.

Oman Beach : ఒమ‌న్ బీచ్ లో కొట్టుకుపోయిన ముగ్గురు భార‌తీయులు..తండ్రి, బాలుడి మృత‌దేహాలు ల‌భ్యం

Oman Sea

oman beach : ఒమ‌న్ స‌ముద్ర తీరంలో ముగ్గురు భార‌తీయులు గ‌ల్లంత‌య్యారు. బీచ్‌లో భారతీయుడు, తన ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయారు. రాకసి అల‌లు తండ్రి, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను మింగేశాయి. ఆ ముగ్గురి ఆచూకీ కోసం స్థానిక పోలీసులు, అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా తండ్రి, బాలుడి మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. కూతురి ఆచూకీ ల‌భించ‌లేదు.

మ‌హారాష్ట్ర సాంగ్లీ జిల్లాకు చెందిన శ‌శికాంత్‌ మెకానిక‌ల్ ఇంజినీర్‌గా దుబాయిలో స్థిర‌ప‌డ్డారు. 20 ఏండ్ల నుంచి దుబాయ్‌లోనే శ‌శికాంత్‌ త‌న కుటుంబంతో క‌లిసి ఉంటున్నాడు. దుబాయ్‌కి చెందిన ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే బ‌క్రీద్ రోజు సెల‌వు కావ‌డంతో.. త‌న భార్య సారిక‌, ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఒమ‌న్ స‌ముద్ర తీరానికి వెళ్లారు. తీరంలో ఎంజాయ్ చేస్తుండ‌గా రాక‌సి అల‌లు దూసుకొచ్చాయి.

Indian Coast Guard: సముద్రంలో మునిగిపోయిన షిప్.. 22 మందిని రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

దీంతో శ‌శికాంత్‌.. ఇద్ద‌రు పిల్ల‌లు శృతి, శ్రేయాస్ అల‌ల ధాటికి కొట్టుకుపోయారు. క‌ళ్ల ముందే త‌న కుమార్తె, కుమారుడు కొట్టుకుపోవ‌డాన్ని చూసిన తండ్రి.. అప్ర‌మ‌త్తమై వారిని కాపాడుకునేందుకు ముందుకెళ్ల‌గా, ఆయ‌న కూడా అల‌ల ధాటికి స‌ముద్రంలోకి కొట్టుకుపోయారు. ఒడ్డున ఉన్న భార్య‌, కూతురు మాత్ర‌మే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని శ‌శికాంత్ సోద‌రుడు, న్యాయ‌వాది రాజ్ కుమార్ ధ్రువీక‌రించారు.