Missiles Misfire: సైన్యం కసరత్తులు చేస్తుండగా పొరపాటుగా పేలిన మూడు క్షిపణులు

10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మీద రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ స్పందిస్తూ సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయని, ఈ విషయమై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు.

Missiles Misfire: సైన్యం కసరత్తులు చేస్తుండగా పొరపాటుగా పేలిన మూడు క్షిపణులు

3 missiles misfired during army exercise in Rajasthan

Missiles Misfire: భారత సైన్యం కసరత్తులు నిర్వహిస్తుండగా మూడు క్షిపణులు పొరపాటుగా పేలాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో ఉన్న పోఖ్రాన్‭లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఈ ఘటన జరిగింది. కాగా, ఈ ఘటనకు కారణం సాంకేతిక లోపమేనని తెలుస్తోంది. అయితే భారీ పేలుడు సంభవించినప్పటికీ.. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కనీసం ఎవరికి గాయాలు సైతం కాలేదు. పొరపాటుగా పేలిన క్షిపణులు సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లాయి.

Karnataka Polls: చాముండేశ్వరి కాదు, కోలార్ కాదు.. కొడుకు స్థానం నుంచి పోటీకి సిద్ధమైన మాజీ సీఎం సిద్ధూ

10-25 కిలోమీటర్ల పరిధి వరకు దూసుకెళ్లే ఈ క్షిపణులను పరీక్షిస్తోన్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మీద రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ స్పందిస్తూ సాధారణ విన్యాసాల్లో భాగంగా క్షిపణులు మిస్ ఫైర్ అయ్యాయని, ఈ విషయమై దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు. పొలాల్లోకి దూసుకెళ్లిన క్షిపణుల శకలాలను అధికారులు గుర్తించారు. రెండు లభించాయని, మూడో దాని కోసం వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.