Next CBI Chief : సీబీఐ కొత్త డైరక్టర్ నియామకంపై ప్రధాని సమావేశం

కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) కొత్త డైరెక్టర్‌ ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది.

Next CBI Chief : సీబీఐ కొత్త డైరక్టర్ నియామకంపై ప్రధాని సమావేశం

3 Names For Next Cbi Chief As Pm Led Panel Meets At His House

Next CBI Chief కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) కొత్త డైరెక్టర్‌ ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సోమవారం భేటీ అయింది. ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీలోని సభ్యులైన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి హాజరయ్యారు.

1984-87బ్యాచ్ లకు చెందిన 100మందికి పైగా ఆఫీసర్ల పేర్లను కమిటీ పరిశీలించింది. అయితే 90నిమిషాలకు పైగా జరిగిన ఈ సమావేశంలో యూపీ డీజీపీ హెచ్ సీ అవస్థి, సహస్త్ర సీమా బల్(SSB) డైరక్టర్ జనరల్ కేఆర్ చంద్ర,హోంవ్యవహారాల శాఖ స్పెషల్ సెక్రటరీ(ఇంటర్నల్ సెక్యూరిటీ)వీఎస్ కే కౌముది పేర్లను సీబీఐ డైరక్టర్ పదవి కోసం షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని డైరెక్టర్​ పదవికి ఖరారు చేసి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. సీబీఐ డైరెక్టర్‌ రెండేళ్ల పాటు సేవలందించనున్నారు. కొత్తగా ఎంపికయ్యేవారు 2023 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 2 సీబీఐ డైరెక్టర్‌ ఆర్‌కే శుక్లా పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి పూర్తి స్థాయి డైరెక్టర్‌ లేకుండానే సీబీఐ పనిచేస్తోంది. ప్రస్తుతం 1988 బ్యాచ్‌ గుజరాత్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్ సిన్హా తాత్కాలిక చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.