పిచ్చి పీక్స్  : పట్టాలపై సెల్ఫీ.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.  ఈ సంఘటన హర్యానాలోని పానిపట్‌లో బుధవారం (మే 1) ఉదయం జరిగింది.

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 09:29 AM IST
పిచ్చి పీక్స్  : పట్టాలపై సెల్ఫీ.. రైలు ఢీకొని ముగ్గురు మృతి

రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.  ఈ సంఘటన హర్యానాలోని పానిపట్‌లో బుధవారం (మే 1) ఉదయం జరిగింది.

సెల్ఫీ పిచ్చి ప్రాణాల్ని తీస్తోంది. ఇటువంటి ఘటనల గురించి వింటున్నాం.. టీవీలలో చూస్తున్నాం. నిత్యం ఇలాంటి  సెల్ఫీ ప్రమాద ఘటనలు ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సెల్ఫీల మోజులో పడి పలువురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదకర ప్రాంతాలలో ఫోటోలు తీసుకుంటున్న సందర్భాలలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 
Also Read : ఫేస్ బుక్ కొత్త డిజైన్ : ఐకానిక్ బ్లూ ప్లేస్ లో.. వైట్ కలర్

ఇటువంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది.  రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు.  ఈ సంఘటన హర్యానాలోని పానిపట్‌లో బుధవారం (మే 1, 2019) ఉదయం జరిగింది. పానిపట్‌కు పెళ్లికొచ్చిన ఓ నలుగురు యువకులు అక్కడికి సమీపంలో ఉన్న రైలు పట్టాలమీదికి వచ్చారు. దూరం నుంచి వస్తున్న రైలు  సెల్ఫీలో పడేలా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతలోనే రైలు  వేగంగా దూసుకు వచ్చేసింది. దీంతో కంగారుపడిన వారు  ప్రాణాలు కాపాడుతుకునేందుకు మరో ట్రాక్‌పైకి దూకేశారు.

ఆ ట్రాక్ పై నుంచి కూడా మరో  రైలు దూసుకురావడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరి వయసు 19 ఏళ్లు కాగా మరొకరిది 18 ఏళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ప్రపంచ వ్యాప్తంగా 2011 -17 మధ్య కాలంలో సెల్ఫీలు దిగుతూ 259 మంది మృతి చెందినట్లు తేలింది. సెల్ఫీ మరణాలు ఇండియాలో అత్యధికంగా ఉండగా తరువాతి స్థానాల్లో రష్యా, అమెరికా, పాకిస్థాన్‌లు ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. అంటే సెల్ఫీల పిచ్చిలో భారత దేశం ముందుందన్నమాట.
Also Read : మానవ జాతికి రక్షణగా : ఏలియన్స్.. మనతో రహస్యంగా జీవిస్తున్నాయి!