ఆర్టికల్ 370 రద్దు తరువాత : జమ్ము టోల్‌ప్లాజా వద్ద ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • Published By: veegamteam ,Published On : January 31, 2020 / 04:51 AM IST
ఆర్టికల్ 370 రద్దు తరువాత : జమ్ము టోల్‌ప్లాజా వద్ద ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ములోని నగ్రోట టోల్ ప్లాజా వద్ద భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీన కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో భారత జవాన్లు ముగ్గురు ఉగ్రవాదుల్ని తుదముట్టించారు. ఈ ఘటనలో ఓ జవాన్ కూడా గాయపడ్డాడు. నగ్రోట  టోల్ ప్లాజా వదద్ భద్రతా బలగాలు  శుక్రవారం (జనవరి 30) తెల్లవారుఝామున 5 గంటలకు ఓ ట్రక్కును తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు హతం కాగా ఓ జవాన్ కు గాయాలయ్యాయి.

ఉగ్రవాదులు శ్రీనగర్ వైపు ట్రక్కులో ప్రయాణిస్తున్న సమయంలో..భద్రతాదళాలు తనిఖీలు చేస్తుండగా ట్రక్కులో ఉన్న ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారనీ దీంతో జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ ఇన్ స్పెక్టరు జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు. ట్రక్కు నుంచి ఏకే-47, కొన్ని రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 

హతం అయిన ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఈ ఘటనలో గాయపడిన జవాన్ ను హాస్పిటల్ కు తరలించామని జమ్మూ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు  ముఖేష్ సింగ్ తెలిపారు.తెలిపారు. ట్రక్కులో మరో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో భద్రతా దళాలు జాతీయ రహదారి గుండా ఉన్న అటవీ ప్రాంతాలలో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా ఉగ్రవాదులు తప్పించుకోకుండా జమ్ము – కశ్మీర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 

 

భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఈ ఘటనతో ఉధంపూర్ మండలంలోని అన్ని స్కూల్స్, కాలేజీలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.కాగా..జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 అనంతరం జమ్మూలో ఉగ్రవాదులు భద్రతాదళాలపై కాల్పులకు దిగటం ఇదే మొదటిసారి. ఈ  క్రమంలో భారత భద్రతాదళాలు ఉగ్రదాడిని సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ముగ్గురు ఉగ్రవాదులకు హతమార్చాయి.