COVID-19 Vaccination Centre : మీ దగ్గరలో ఎక్కడైనా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయా? ఈ 3 మార్గాల్లో తెలుసుకోవచ్చు

COVID-19 Vaccination Centre : మీ దగ్గరలో ఎక్కడైనా కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయా? ఈ 3 మార్గాల్లో తెలుసుకోవచ్చు

Covid 19 Vaccination Centre

COVID-19 vaccination centre : భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్లు విధించాయి. పలు ప్రాంతాల్లో ఆంక్షలు, కర్ఫ్యూలు విధించాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రోజవారీ కరోనా కొత్త కేసుల సంఖ్య పెరిగిపోవడంతో వ్యాక్సినేషన్ డిమాండ్ పెరిగింది. అయితే కొన్ని చోట్ల వ్యాక్సిన్ డోసుల కొరత ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా కేసుల తీవ్రత మధ్య కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. చాలామందికి కరోనా వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయో లేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అందుకే గూగుల్ వంటి టెక్ కంపెనీలు ప్రజల సౌకర్యార్థం కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈజీగా తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ లో ఈ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. గూగుల్ మాప్స్ మాత్రమే కాకుండా ఇతర మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయి. ఈ మూడు మార్గాల్లో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్లను సులభంగా గుర్తించవచ్చు.

గూగుల్ మ్యాప్స్ ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ గుర్తించడం ఎలా? :
– గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు సమీపంలోని కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ గుర్తించవచ్చు.. సింపుల్ గా ఇలా సెర్చ్ చేయండి..
– కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లకు సెర్చ్ చేస్తే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు దగ్గరలోని సెంటర్ల జాబితాను చూపిస్తుంది.
– ప్రస్తుతం వ్యాక్సినేషన్ సెంటర్ ఓపెన్ అయిందా? మూసి ఉందా కూడా గూగుల్ మ్యాప్స్ స్టేటస్ చూపిస్తుంది.

CoWIN యాప్ ద్వారా సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు :
– cowin.gov.in లోకి వెళ్లండి.
– హోంపేజీలో Find Your Nearest Vaccination Center ఆప్షన్ ఎంచుకోండి.
– రీజియన్ వారీగా వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించవచ్చు.
– వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాల కోసం.. కరెంట్ లొకేషన్ పై క్లిక్ చేయండి.
– లేదంటే.. మీ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి..
– మీ దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించవచ్చు.
– CoWIN యాప్ ద్వారా మీ దగ్గరలోని ఆస్పత్రి పేరు, వ్యాక్సినేషన్ సెంటర్ల వివరాలను తెలుసుకోవచ్చు.
– వ్యాక్సినేషన్ సెంటర్ల పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

MapmyIndia ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లను గుర్తించాలంటే? :
– MapmIndia portal లేదా యాప్ లోకి Login అవ్వండి.
– సెర్చ్ బాక్సు‌లో కరెంట్ లొకేషన్ ఆప్షన్ లేదా మీ అడ్రస్ ఎంటర్ చేయండి.
– లెప్ట్ మెనూలో వ్యాక్సినేషన్ సెంటర్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
– మీకు అక్కడ వ్యాక్సినేషన్ సెంటర్ ఆప్షన్ జాబితా కనిపిస్తుంది.
– మీ ఇంటి దగ్గర నుంచి సెంటర్ ఎంతదూరంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.
– మ్యాప్‌పై MapmyIndia వ్యాక్సినేషన్ సెంటర్ అడ్రస్ పిన్ చేసి ఉంటుంది. ఇంజెక్షన్ లోగో ఉంటుంది.